పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | environment is importent | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Published Sun, Jul 17 2016 9:26 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత - Sakshi

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

 
 
విడవలూరు: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోవూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జీ బాలకష్ణయ్య అన్నారు. విడవలూరుకు చెందిన వేదా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న ప్రతికూల పరిస్థితులకు పర్యావరణం దెబ్బతినడమే కారణమన్నారు. చెట్లను విపరీతంగా నరకడంతో పాటు వాటి స్థానంలో మళ్లి మొక్కలు నాటకపోవడంతో వర్షపాతం గణనీయంగా తగ్గిపోతోందన్నారు. చెట్లు తగ్గిపోతుండటంతో వాతావరణంలో కాలుష్య శాతం అధికంగా పెరిగి మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రతిఇంటిలో ఒక మొక్కను నాటేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం ఆయుష్‌ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ కష్ణయ్య, ఎంపీపీ అలివేలమ్మ, తహసీల్దార్‌ బషీర్, కోవూరు మార్కెటింగ్‌ చైర్మన్‌ రామిరెడ్డి విజయభానురెడ్డి, ఈస్ట్రన్‌ ఛానల్‌–2 చైర్మన్‌ పాశం శ్రీహరిరెడ్డి, యశోద, ప్రభాకర్, విజయ్‌కుమార్, శ్రీనివాసులు, మల్లికార్జున్, సుధాకర్, కిరణ్‌కుమార్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement