సమావేశంలో మాట్లాడుతున్న పూడి తిరుపతిరావు
ఈ–పాస్‌బుక్ విధానం వద్దు
Published Thu, Jul 28 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ రెవెన్యూ రికార్డుల్లో పెనుమార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ఈ–పాస్‌బుక్ విధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని క్రాంతిభవన్‌లో అఖిలపక్ష రైతు సంఘ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు మాట్లాడుతూ రైతులకు భూ హక్కుపై నమ్మకం కల్పిస్తూ ఎన్‌టీఆర్ పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్‌లను జారీ చేయగా ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థలో అవినీతి కారణంగా ఆ వివరాలు అస్తవ్యస్తంగా మారాయన్నారు. ఈ–పాస్‌బుక్‌లో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తక్షణమే రీసెటిల్‌మెంట్ సర్వే చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో కె.మోహనరావు, అప్పారావు, ఎ.సూరిబావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement