- ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
ప్రతి దళిత కూలీకి మూడెకరాల భూమి
Published Sat, Aug 27 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
పర్వతగిరి : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి దళిత కూలీకి మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం మండలంలోని వడ్లకొండ గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసిన 32 ఎకరాల వ్యవసాయ భూమిని పరిశీలించి వారి తో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 10 వేల ఎకరాలుదళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూ పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 10 వేల ఎకరాలు భూ పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి దళిత వ్యవసాయ కూలీని గుర్తించి మూడెకరాల భూమిని పంపిణీ చేయటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 4,500 మందికి రూ.46 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విడుదల చేశామని పది పదిహేను రోజుల్లో సబ్సీడిని 25 వేల లబ్ధిదారులకు రూ.200 కోట్లు పంపిణీ చేస్తామని వివరించారు. 2016–17 సంవత్సరానికి రెండు నెలల్లో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. సీని యర్ అసిస్టెంట్ అశోక్, డీటీ పవన్‌కుమార్, ఆర్‌ఐ మధు, వీఆర్వో వెంకటయ్య, ఎంపీటీసీ పట్టాపురం తిరుమల ఏకాంతంగౌడ్, సర్పంచ్ రాయపురం శ్రీనివాస్, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వల్లందాసు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ వల్లందాసు రంగయ్య, రవీందర్, జుట్టుకొండ రమేష్, చిన్న, ఉప్పలయ్య, దేవేం దర్, కొంరయ్య తదితరులు ఉన్నారు.
కాలర్ పట్టుకుంటేనే వర్గీకరణ సాధ్యం
న్యూశాయంపేట : అంబేద్కర్ సిద్ధాంతాలు పాటిస్తామని చెప్పి మంద కృష్ణ అగ్రకులాల కాళ్లు మొక్కుతున్నారని మొక్కితే వర్గీకరణ జరగదని కేంద్రంలోని అధికార పార్టీ నాయకుల కాలర్ పట్టుకుంటేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హన్మకొండ సుబేదారిలోని జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళ్లు పట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం రాలేదని పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించామన్నారు. ప్రజాఉద్యమం ద్వారానే వర్గీకరణ సాధ్యమన్నారు. వర్గీకరణ కోసం నవంబర్‌లో 8 సం ఘాలను ఐక్యంచేసి, సెప్టెంబర్‌లోజీపుయాత్ర, అక్టోబర్‌లో అలాయ్ బలాయ్ కార్యక్రమాలు నిర్వహించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ను ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి తీసుకవస్తామన్నారు. వరంగల్‌లో నూతనంగా ఏర్పడే నాలు గు జిల్లాలో కమిటీలు వేసేందుకు ఇన్‌చార్జిగా బొల్లికుంట వీరేందర్‌ను నియమిస్తున్నట్లు పే ర్కొన్నారు. బి.వీరేందర్, దుప్పటి కిశోర్, మైస ఉపేందర్, రాజేందర్, మధుకర్, కందుకూరి బాబు, రమేష్, రాజేందర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement