
తలారి రుద్రయ్య
పెనుమూరు: వేపంజేరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తలారి రుద్రయ్య(65) శుక్రవారం రాత్రి మృతి కన్నుమూశారు. కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధి, బీపీ, షుగర్‌తో బాధపడుతున్న తలారి రుద్రయ్య నెల రోజులుగా తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ తలారిపల్లెలో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. తలారి రుద్రయ్య మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఎంతో నమ్మిన బంటుగా పేరు గడించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక వేపంజేరి నియోజకవర్గంనుంచి 1983లో రుద్రయ్య పోటీ చేశారు. వేపంజేరి తొలి టీడీపీ ఎమ్మెల్యేగా రుద్రయ్య గెలిచారు. ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా కూడా రుద్రయ్య కొనసాగారు. తలారి రుద్రయ్య మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు మహాసముద్రం సురేష్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.