ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ దాడులు
Published Fri, Aug 12 2016 4:23 PM | Last Updated on Thu, Jul 18 2019 2:28 PM
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ కేంద్రాలపై ఆకస్మికదాడులు చేపట్టిన అధికారులు గండ్లగూడెం, రెడ్యాలపాడు, కొమ్ముగూడెం గ్రామాల్లో 40 లీటర్ల నాటుసారా, 300 లీటర్ల బెల్లం పానకం, ఓ స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అదే విధంగా పాల్వంచలో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం స్థావరాలపై పోలీసులు దాడులు చేసి ఓ గొడౌన్‌లో నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement