హిందూపురం అర్బన్ : పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు.బడ్ల్ బ్యాంకు, ల్యాబ్, కాన్పుల వార్డు, డయాలసిస్ కేంద్రం, అన్నా క్యాంటీన్‌లను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడారు. మెడాల్ ల్యాబ్‌లో చేస్తున్న పరీక్షలు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.
పరీక్షల ఫలితాలు ఏరోజుకు ఆ రోజే ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్, మే లో భవనం ప్రారంభిస్తామని చెప్పారు. ఓపీ పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులకు మూడింతల బడ్జెట్ పెంచామన్నారు. ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ, వైద్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలు
Published Sat, Feb 11 2017 9:49 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
Advertisement