నేత్రదానంతో అంధులకు వెలుగునిద్దాం
నేత్రదానంతో అంధులకు వెలుగునిద్దాం
Published Fri, Sep 9 2016 1:31 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
నెల్లూరు(అర్బన్):ప్రతి ఒక్కరూ నేత్ర దానం చేయడం ద్వారా చీకట్లో మగ్గుతున్న అంధులకు వెలుగునిద్దామని జెసీ–2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్థానిక గాంధీబొమ్మ వద్ద నుంచి మద్రాసు బస్టాండ్ వరకు నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని జేసీ–2 ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి మరణించి కూడా ఇద్దరి జీవితాలకు వెలుగును పంచే మహత్తర పుణ్యకార్యక్రమం నేత్రదానమని తెలిపారు.
కుటుంబ సంప్రదాయంగా నేత్రదానం
ర్యాలీ అనంతరం మద్రాసుబస్టాండ్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ భవనంలో నేత్రదాన ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎం.మంజులమ్మ మాట్లాడారు. నేత్రదానాన్ని కుటుంబ సంప్రదాయంగా మార్చుకుందామని తెలిపారు. అనంతరం నేత్రదాన మోటివేటర్లను జ్ఞాపికలతో సత్కరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు అధ్యక్షత వహించిన ఈ సభలో పెద్దాస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల, డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీదేవి, బ్లడ్ బ్యాంకు చైర్మన్ డాక్టర్ ఏవీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement