పావగడ : పట్టణ సమీపంలోని కణివేనహళ్లి గేట్ వద్ద శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కణివేనహళ్లికి చెందిన గొల్ల సత్యనారాయణ(65) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా అతడి భార్య సంజీవమ్మ(58) తీవ్రంగా గాయపడింది. భార్యతో కలిసి అతడు మోటారు బైకులో గుండార్లపల్లి మార్గంలోని పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా పావగడ నుంచి ఎదురుగా వస్తున్న షిఫ్ట్ కారు..బైక్‌ను ఢీ కొని కొద్ది దూరం ఈడ్చుకు పోవడంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.
ఆమెకు కాలు పూర్తిగా దెబ్బతినడంతో బెంగుళూరుకు తరలించారు. వారికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. వారు మడకశిర రోడ్డులోని స్వామీజీ ఆస్పత్రి ఎదురుగా ఇల్లు కట్టుకుని నివాసముండేవారు. కడపకు చెందిన షిఫ్ట్ కారు అగళికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ హరి పోలీసులకు లొంగిపోయాడు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ మంజునాథ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
Published Sat, Jan 7 2017 11:55 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
Advertisement
Advertisement