తహసీల్దార్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం | farmer suicide in the front of tahsildar | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

Published Thu, Aug 11 2016 12:07 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

farmer suicide in the front of tahsildar

  • దాయాదుల మధ్య భూ వివాదమే కారణం 
  • బాధితుడి పరిస్థితి విషమం 
  • బుద్ధారం సాదాబైనామాల గ్రామ సభలో ఘటన
  • గణపురం : తనకు చెందిన భూమిని తనకు కాకుండా కొందరు గ్రామపెద్దలు అడ్డుపడుతున్నారని మనోవేదనకు గురైన ఓ రైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని బుద్ధారంలో బుధవారం జరిగింది. సాదాబైనామాల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో తహసీల్దార్‌ జీవాకర్‌రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుద్ధా రం గ్రామానికి చెందిన  చెలుమల్ల బాబురావు, చెలుమల్ల రాజేందర్‌ మధ్య కొన్నాళ్లుగా భూవివాదం ఉంది. రాజేందర్‌కు చెందిన భూమిని బాబురావు చాలాకాలం నుంచి ఆక్రమించుకుని దున్నుతున్నాడు. ఈ విషయమై రాజేందర్‌ గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసి పంచాయితీ పెట్టాడు. ఇరువర్గాల పెద్దమనుషులు రెండెకరాల భూ మిలో ఎకరం రాజేందర్‌కు, ఎకరం బాబురావుకు కేటాయిస్తూ తీర్మానం చేశారు. దాని ప్రకారం తనకు రావాల్సిన ఎకరం భూమిని సాదాబైనామాల గ్రామసభలో పహణీలో చేర్చాలని రాజేందర్‌ గ్రామసభకు వచ్చాడు. అక్కడే ఉన్న సర్పంచ్‌ భర్తతో రాజేందర్‌కు ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రాజేందర్‌ గ్రామంలోకి వెళ్లి క్రిమిసంహరక మందు కొనుగోలు చేసి తిరిగి గ్రామపంచాయతీకి వచ్చాడు. అందరి ముం దే తన భూమి తనకు కాకుండా అడ్డుపడుతున్నవారి మూలంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని అంటూనే మందు తాగాడు. సర్పంచ్‌ భర్త మునుకుంట్ల సంగయ్య, ఉపసర్పంచ్‌ గండ్ర మాధవరావు, సీహెచ్‌ బాబురావు, సురేందర్, రవీందర్‌  తదితరులు కారణమని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీఎంను సంబోధిస్తూ  లేఖ కూడా రాశాడు. తహసీల్దార్‌కు లేఖ అందించి  రాజేందర్‌ మందు తాగాడు. దీంతో వెంటనే అతడిని గణపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్‌ దగ్గర ఉండి వైద్యం చేయించారు. కాగా బాధితుడి తల్లి ఉదయమ్మ, భార్య మమత ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement