నగదు కోసం రోడ్డెక్కిన రైతులు | farmers on road for cash | Sakshi
Sakshi News home page

నగదు కోసం రోడ్డెక్కిన రైతులు

Published Mon, Jan 30 2017 10:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

నగదు కోసం రోడ్డెక్కిన రైతులు - Sakshi

నగదు కోసం రోడ్డెక్కిన రైతులు

– ఎమ్మిగనూరులో రాస్తారోకో
– ఏడీబీ బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం
ఎమ్మిగనూరు రూరల్: బ్యాంకులో ఖాతాదారులకు ఇచ్చే నగదు పెంచాలంటూ సోమవారం  రైతులు పెద్ద సంఖ్యలో స్థానిక వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. రూ. 4 వేలు కంటే ఎక్కువ ఇవ్వనని బ్యాంకు అధికాలు చెప్పటంతో రైతులు ఆగ్రహంతో అందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. అన్ని బ్యాంకుల్లో రూ.24 వేలు ఇస్తుంటే ఏడీబీలోనే  రూ. 4 వేలు ఇస్తున్నారని మండిపడ్డారు. అక్కడికి చేరుకున్న పట్ణణ ఎస్‌ఐ హరిప్రసాద్‌  సర్దిచెప్పగా వారు ఆందోళన విరమించారు. 
 
వివాహం ఎలా చేయాలి:  గోవిందు, రైతు, హెచ్‌.మురవణీ
వచ్చే నెల 1వ తేదీన నా కుమార్తె వివాహం ఉంది.  పెళ్లి బట్టలు, ఖర్చులకు డబ్బులు లేవు.  మిరప విక్రయించగా రూ.1.20 లక్షలు డబ్బులు వచ్చాయి. అవి బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్నాయి. ఇప్పుడు రూ. 4 వేలు మాత్రమే ఇస్తానంటే ఎలా? వివాహం ఎలా చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement