మైదుకూరు టౌన్:
త్వరలో జరగనున్న పశ్చిమ రాయలసీమ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మైదుకూరు నియోజకవర్గం నుంచి సత్తా చాటాలని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మైదుకూరులో గురువారం పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో జరిగే ఈ ఎన్నికకు సంబంధించి 38 నియోజకవర్గాల పరిధిలోని పట్ట భద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందని, అన్ని నియోజకవర్గాల కన్నా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ తెప్పించేందుకు కషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త పట్టభద్రులతో మాట్లాడి తమ పార్టీకి మద్దతు తెలిపేవిధంగా కషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రముఖ న్యాయవాది జ్వాలా నరసింహశర్మ, బ్రహ్మంగారిమఠం సింగిల్ విండో అధ్యక్షుడు వీరనారాయణరెడ్డి, లక్ష్మీపేట నారాయణరెడ్డి, దువ్వూరుకు చెందిన కానాల జయచంద్రారెడ్డి, గాంధీనగరం నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలి
Published Thu, Oct 13 2016 11:54 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement