mla raghuramireddy
-
‘ప్రజలు ఛీ కొట్టిన నేత చంద్రబాబు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజలు ఛీ కొట్టిన నేత అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు నడుం బిగించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలితంగానే కేసీ కెనాల్‌కు నీరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు రాజ్యం ఏలుతున్నారని విమర్శించారు. మైదుకూరు నియోజకవర్గంలోని రాజోలు రిజర్వాయర్ పూర్తి అవ్వాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీకి 5కోట్లు ఇస్తామన్న చంద్రబాబు పంగనామాలు పెట్టాడని తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా అవినాష్ రెడ్డిని ఘన మెజార్టీతో గెలిపించాలని కోరారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కరువు కవల పిల్లలని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన, రైతుల వ్యతిరేక పాలన కొనసాగుతూందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు వస్తున్నాయని అన్నారు. మైదుకూరు కేసీ కెనాల్‌కు నీళ్లు రావటానికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి కారణమన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల పట్ల కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజలకోసం తపిస్తున్న ఏకైక నాయకుడని అన్నారు. ఆ ఘనత వైఎస్‌కే దక్కుతుంది పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు తెప్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు. 2019లో జరగబోయే ఎన్నికల యుద్ధానికి వైఎస్సార్ కాంగ్రెస్ సైనికులు సిద్దం అవ్వాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాకు సాగు నీరు ఇచ్చామని చెప్పుకోవటానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్టనిలువునా ముంచిన ఘనుడని అన్నారు. -
పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యమేలుతున్నారు
కడప కార్పొరేషన్: తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యమేలుతోందని మైదుకూ రు శాసనసభ్యులు ఎస్. రఘురామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు విమర్శించారు. మంగళవారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ అరాచకాలు, అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. యనమల రామక్రిష్ణుడు బంధువని అధికారులు ఆయన ఎలా చెబితే అలా ఆడుతున్నారని మండిపడ్డారు. ఈనెల 19వ తేది పలుగురాళ్లపల్లెలో మైనార్టీలు, దళితులు వైఎస్ఆర్సీపీలో చేరి మైదుకూరులో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారని, దాన్ని ఓర్వలేని టీడీపీ నాయకులు వారిని బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. మైదుకూరు పట్టణమంతా టీడీపీ వారు ఫ్లెక్సీలు వేసుకుంటే తొలగించని పోలీ సులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్క ఫ్లెక్సీ ఏర్పా టు చేసుకుంటే తొలగించాలని చెప్పడం అన్యాయమన్నారు. పోలీసులు దగ్గరుండి ఆ ఫ్లెక్సీని తొలగించారన్నారు. దీన్ని నిరసిస్తూ తాము ఆందోళన చేస్తే మైదుకూరు సీఐ ఎమ్మెల్యే అన్న గౌరవం లేకుండా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను బండబూతులు తిడుతూ బెదిరించారని, ఆయనకు ఆ పవర్ ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. సీఐ పొగరుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆయన చర్యలను బట్టి తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ లో చేరిన వారు రూ.72వేలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారని, దాన్ని తిరిగి ఇవ్వాలని సుధాకర్‌యాదవ్ మనుషులు బెదిరించడం సరికాదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ల అబ్బ సొత్తా...అది ప్రభుత్వ సొమ్ము కదా...దాన్ని కూడా రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నియోజకవర్గంలో రూ.4కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలన్నీ పోలీసుల పహారాలోనే సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు మాబూసాబ్, మున్నా మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ.72వేలు కట్టి పార్టీ మారాలని టీడీపీ వారు తమను బెదిరించారని, డబ్బులు ఇవ్వపోతే గుడ్డలిప్పదీసి కొడతామని హెచ్చరించారన్నారు. మైదుకూరులో ముస్లిం మైనా ర్టీలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అఫ్జల్ఖాన్, తుమ్మలకుంట శివశంకర్, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, మైనార్టీ నాయకులు ఖాదర్‌బాషా, షరీఫ్, వలీ పాల్గొన్నారు. -
సీఎం, పీఎం ఇద్దరూ తోడు దొంగలే
మైదుకూరు(చాపాడు): ఏపీ విభజన అనంతరం రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇద్దరూ తోడుదొంగలేనని ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టపు హామీల అమలు, కడప ఉక్కుఫ్యాక్టరీ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘాల(జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జీపుజాతా గురువారం మైదుకూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాలేజీ, స్కూళ్ల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. అనంతరం ఎన్నికల్లో నెగ్గేందుకు నానా అబద్దాలు అడి అధికారంలో వచ్చాక తెలుగు ప్రజలను అన్యాయం చేస్తున్నారన్నారు. పోరాటాలు చేసైనా మన హక్కులను సా«ధించుకుందామన్నారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రం కోసం సాధించింది ఏమీ లేదన్నారు. ప్రత్యేకహోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీ కావాలని సీఎం కోరారని తెలిపారు. ఇప్పుడేమో హోదా కావాలంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీతో పోరాటం అంటారు.. కేంద్రంలో బీజేపీతో రాజీ పడతారని చంద్రబాబును విమర్శించారు. రూ.1500 కోట్లతో పనులు ప్రారంభించిన కడప ఉక్కు ఫ్యాక్టరీని అప్పట్లో చంద్రబాబు ఆపించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఉక్కు దీక్ష అని మోసం చేస్తున్నాడన్నారు. వైఎస్ బతికి ఉన్నట్లయితే ఉక్కు ఫ్యాక్టరీ పూర్తయి లక్షలాది మందికి ఉపాధి దొరికేదని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబు మాత్రం ప్రతి దానిపై యూటర్న్ తీసుకుంటూ ఊసరవెల్లిని మింగి రంగులు మారుస్తున్నాడని ఆయన విమర్శించారు. పోరాటాలతోనే మన హక్కులను సాధించుకుందామని.. విద్యార్థి యువజన సంఘాలు(జేఏసీ) ఈ నెల 25న చేపట్టనున్న కోటి మందితో మానవ హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరం రోడ్డెక్కుదామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలతో పాటు చాపాడు జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, ఎంపీపీ భర్త లక్షుమయ్య, వైఎస్సార్సీపీ మైదుకూరు పట్టణ అధ్యక్షుడు లింగన్న, చిన్న, గోశెట్టి లక్షుమయ్య, బోకుల కొండారెడ్డి, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సొక్కం శివ, కుశెట్టి రాయుడు, మున్నా, షరీఫ్, అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, చాపాడకు చెందిన మాజీ సింగిల్ విండో జయరామిరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎల్లారెడ్డి, మహేష్ యాదవ్, ఎస్సీ నాయకులు జయరాజు, దువ్వూరుకు చెందిన కానాల జయచంద్రారెడ్డి, శంకర్‌రెడ్డి, చింతకుంట వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతును బూటు కాలితో తంతావా..?
► ఎస్ఐ తీరుపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం ► అవినీతే ఎస్ఐ ధ్యేయం అంటూ మండిపాటు చాపాడు: దేశానికి అన్నం పెట్టే రైతులంటే అంత చులకనా.. ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా, విచక్షణా రహితం గా బూటు కాలితో తంతావా.. అంటూ చాపాడు ఎస్ఐ శివశంకర్‌పై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పండించిన కూరగాయలను విక్రయించుకునేందుకు మోటార్ బైకుపై వెళుతున్న రైతు రామచంద్రారెడ్డిని ఎస్ఐ బూటు కాలితో తన్నడం దారుణమన్నారు. రైతు వద్ద వాహనానికి సంబంధించిన ఆర్సీ, లైసెన్స్ ఉన్నప్పటికీ దురుసుగా ప్రవర్తించడం, అసభ్యపదజాలంతో దూషించడం మంచి పద్ధతి కాదన్నారు. ఎదుటివారి కుటుంబీకులను ఉద్దేశించి దూషించే సమయంలో తమ కుటుంబం గురించి కూడా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. మండలానికి వచ్చిన రెండేళ్లలో ఎస్ఐ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించాడని, ప్రతి రోజూ ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమ వసూళ్లు చేస్తున్నాడని ఆరోపించారు. తిప్పిరెడ్డిపల్లె, రాజుపాళెం ప్రాంతాల నుంచి ప్రతి రోజూ వెళుతున్న 100 ఇసుక ట్రాక్టర్ల నుంచి ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నాడని ఆయన అన్నారు. డబ్బులు ఇవ్వకపోతే సంబంధిత ట్రాక్టర్ల యజమానులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తాడన్నారు. ఇలా ప్రతి నెలా రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నాడని, సంపాదనే లక్ష్యంగా అన్యాయంగా విధులు నిర్వర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. అనేక చోట్ల ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను పట్టుకుంటున్నారని, ఎస్ఐపై నిఘా పెట్టి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇలాంటి ఎస్ఐలను ప్రజల మధ్యలో పెట్టకుండా ఎక్కడికైనా లూప్ లైన్ లో పంపాలని కోరారు. ఎస్ఐపై పోలీసు ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఈ బిల్లుల భారం మోయలేం
ఖాజీపేట: చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయని అంత బిల్లు తాము ఎలా చెల్లించాలని పలువురు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఖాజీపేట మండలం పాత ఏటూరు, కొత్త ఏటూరు గ్రామాల్లో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే రఘురామిరెడి్డతో మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో తమకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేవారని, నేడు భారీగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయని తెలిపారు. పూట గడవడమే కష్టంగా ఉన్న తాము ఇంత బిల్లులు చెల్లించలేమని వారు ఎమ్మెల్యేకు చెప్పి వాపోయారు. బాబు చెప్పేదొకటి.. చేసేదొకటి. దళితుల ఆవేదనపై స్పందించిన ఎమ్మెల్యే రఘురామిరెడి్డ మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేదొకటి చేసేది మరొకటి అని విమర్శించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్న చూపన్నారు. ఓట్ల కోసం ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జనార్ధన్‌రెడ్డి, మాజీ ఉప మండలాధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దస్తగిరిబాబు, యూత్ కన్వీనర్ మద్దిక నాగేశ్వర్‌రెడ్డి, త్రిపురవరం సర్పంచ్ కృష్ణారెడ్డి, ఏటూరు సర్పంచ్ భర్త రాజగోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు చిన్రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, త్రిపురవరం నాగసుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ గాలిపోతు మనోహర్, అంబటి శివారెడ్ది తోపాటు మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలి
మైదుకూరు టౌన్: త్వరలో జరగనున్న పశ్చిమ రాయలసీమ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మైదుకూరు నియోజకవర్గం నుంచి సత్తా చాటాలని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మైదుకూరులో గురువారం పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో జరిగే ఈ ఎన్నికకు సంబంధించి 38 నియోజకవర్గాల పరిధిలోని పట్ట భద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందని, అన్ని నియోజకవర్గాల కన్నా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ తెప్పించేందుకు కషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త పట్టభద్రులతో మాట్లాడి తమ పార్టీకి మద్దతు తెలిపేవిధంగా కషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రముఖ న్యాయవాది జ్వాలా నరసింహశర్మ, బ్రహ్మంగారిమఠం సింగిల్ విండో అధ్యక్షుడు వీరనారాయణరెడ్డి, లక్ష్మీపేట నారాయణరెడ్డి, దువ్వూరుకు చెందిన కానాల జయచంద్రారెడ్డి, గాంధీనగరం నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీ సాగునీటిపై స్పష్టత ఇవ్వండి
చాపాడు: కడప–కర్నూలు సాగునీటి సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణను కోరారు. కేసీ కెనాల్ సాగునీటి సరఫరాపై ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవటంతో గత నెల రోజులకు పైగా సాగునీరు వస్తుండటంతో కేసీ ఆయకట్టు రైతులంతా మమ్మురంగా వరి సాగు చేసుకుంటున్న నేపథ్యంలో రఘురామిరెడ్డి కడపలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 90 శాతం ఆయకట్టు కేసీ సాగునీటిపై ఆధారపడి ఉందని, రైతులంతా 70శాతం మేరకు వరి సాగు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం సాగునీటి సరఫరాపై ఎలాంటి ప్రకటన చేయలేదని, రైతుల ఆవేదన దష్టిలో ఉంచుకుని నీటి సరఫరాపై ప్రకటన చేయాలన్నారు. జనవరి 15వ తేది వరకూ ఏకధాటిగా కేసీ కాలువలకు సాగునీరు ఇవ్వాలని, లేకపోతే వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతుందని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
రైతన్న కోసం పోరాటం
మైదుకూరు టౌన్: సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తెలియజేసేందుకు ఈనెల 29న కడప కలెక్టరేట్ వద్ద రైతు మహాధర్నా చేపట్టినట్లు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలపరిధిలోని ఎన్.ఎర్రబల్లిలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకోసం ఎల్లప్పుడూ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఖరీఫ్ ప్రారంభం కావడంతో రైతులు వరినారు మడులు వేసుకున్నారని, కాని కెసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారడంతో వరి సాగుచేయాలా.? వద్దా? అనే అయోమయం నెలకొందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు మించి 150 టీఎంసీలు నీరు ఉన్నా రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని అందించేందుకు సీఎం చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రజల కష్టాలు బాబుకు పట్టడం లేదన్నారు. రైతులకోసం అదిచేస్తాం.. ఇది చేస్తామని చెబుతున్నారేకాని, పంటలకు కావాల్సిన నీరు అందించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు నీరు–చెట్టు పనులపై శ్రద్ధ చూపుతున్నారేకానీ రైతులకు అవసరమైన సాగునీటికోసం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సాగునీటిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 29న అనగా సోమవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహధర్నాను జిల్లాలోని రైతులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
డెంగీతో బీటెక్ విద్యార్థి మృతి
నివాళులర్పించిన ఎమ్మెల్యే చాపాడు : మండల పరిధిలోని నరహరిపురం గ్రామానికి చెందిన పాళెంపల్లె బాలవీరారెడ్డి కుమారుడు బీటెక్ చదువుతున్న పాళెంపల్లె విష్ణువర్ధన్‌రెడ్డి(22)అనే విద్యార్థి ఆదివారం రాత్రి డెంగీ జ్వరంతో మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. రక్తకణాలు(ప్లేట్లేట్స్) తగ్గిపోయాయని ప్రొద్దుటూరులో ప్రైవేటు వైద్యులు సూచించడంతో కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. నివాళులర్పించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి: డెంగీ జ్వరంతో మృతి చెందిన పాళెంపల్లె విష్ణువర్ధన్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి నివాళులర్పించారు. విష్ణు తల్లిదండ్రులను ఆయన పరామర్శించి, ఓదార్చారు. ఈయన వెంట వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి, నాయకులు బిర్రు రామచంద్రయ్య, సర్పంచ్ సుబ్బరామిరెడ్డి, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, కుచ్చుపాప మాజీ సర్పంచ్ లక్షుమయ్య, నక్కలదిన్నె మురళీశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
రాజకీయ కక్ష సాధింపు
చాపాడు : వి.రాజుపాళెం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య చిన్న రస్తా విషయమై జరిగిన వాగ్వాదంపై పోలీసులు రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. విచారణ చేపట్టి న్యాయం చేయాల్సిన ఎస్ఐ రాజకీయ కోణంలో ఒక వర్గం వారిపై అక్రమ కేసులు నమోదు చేసి, అన్యాయంగా రిమాండ్‌కు తరలించటం ఎంత వరకు సమంజసమని ఆయన పేర్కొన్నారు. వి.రాజుపాళెంలో ఈ నెల 6న నల్లసింగ్ బసయ్య, నల్లసింగ్ కొండయ్య మధ్య పొలంలో రస్తా విషయమై స్వల్వ వాగ్వాదం చోటు చేసుకుంది. కొండయ్య ఫిర్యాదు మేరకు ఎన్.బసయ్య, రమేష్, కుళ్లాయప్ప, శివ, శ్రీనివాసులు, పుల్లయ్య, కృష్ణయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఈ నెల 8న రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంవలో పోలీసు చర్యలు గ్రామంలో వర్గ పోరును పెంచేలా ఉన్నాయని ఎమ్మెల్యే చాపాడు ఎస్ఐ శివశంకర్, కొందరు కానిస్టేబుళ్లపై ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలంకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బసయ్య, కొండయ్య మధ్య జరిగిన గొడవలో శివ, శ్రీనివాసులు, పుల్లయ్య లేరని.. శివ పెద్దరికంగా ఇరు వర్గాల వారికి సర్ది చెప్పినా.. వీరి ముగ్గురిపైనా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. అధికార పార్టీ వైపు శివ వెళ్లలేదని, ఇతనితోపాటు బంధువులను అన్యాయంగా కేసులో ఇరికించడం ఎంత వరకు న్యాయమన్నారు. విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో చాపాడు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యుడు బాలనరసింహారెడ్డి, బీసీ మండల కన్వీనర్ రామచంద్రయ్య, ఎంపీటీసీ సభ్యుడు మహేష్‌యాదవ్, నాయకులు మడూరు ప్రతాప్‌రెడ్డి, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. విచారణ చేపట్టిన డీఎస్పీ: గ్రామంలో గురువారం రాత్రి డీఎస్పీ పూజితానీలం విచారణ చేపట్టారు. గొడవకు గల కారణాలు, జరిగిన తీరు, కేసులో ఉన్న వ్యక్తులపై స్థానికులతో విచారించి నివేదిక సేకరించారు. హత్యా ప్రయత్నం కేసులో నిందితులుగా ఉన్న నల్లసింగ్ బసయ్య, రమేష్, కుళ్లాయప్ప, కృష్ణయ్య, శివ, శ్రీనివాసులు, పుల్లయ్యకు గొడవతో ఉన్న సంబంధంపై గ్రామంలోని మహిళలను విచారణ చేశారు. పొలంలో దారి విషయమై కొండయ్య, బసయ్య గొడవ పడ్డారని మహిళలు తెలిపారు. అందులో కొండయ్య గడ్డివామి కొడవలి తెచ్చుకున్నాడని, ఘర్షణలో కొడవలితో ఇతనికే చిన్నగాయమైందని పేర్కొన్నారు. శివ, శ్రీనివాసులు, పుల్లయ్య గొడవలో లేరని, మధ్యలో శివ వచ్చి ఇరువురిని విడిపించే ప్రయత్నం చేశాడని గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మ, దేవి, సుబ్బమ్మ, రమాదేవి, వెంకటసుబ్బమ్మతో పాటు మరో 20 మంది మహిళలు డీఎస్పీకి తెలిపారు. గ్రామంలో జరిగిన చిన్న గొడవపై ఏడుగురిపై కేసులు ఎలా పెట్టారో తెలియదన్నారు. గ్రామస్తుల తెలిపిన వివరాలను సేకరించుకున్న డీఎస్పీ బాధితులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు కమలాపురం అర్బన్: వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. గురువారం కమలాపురం సబ్‌జైలులో ఉన్న చాపాడు మండలం వి.రాజుపాళెం గ్రామానికి చెందిన ఆర్.శివయాదవ్తోపాటు వారి అనుచరులను ఆయన కలిశారు. అనంతరం జైలు బయట విలేకర్లతో మాట్లాడారు. గడిచిన శాసన సభ ఎన్నికల సమయంలో వి.రాజుపాళెం గ్రామానికి చెందిన శివయాదవ్, ఇతర కార్యకర్తలు వైయస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచినందుకు వారిపై అక్రమ కేసులను బనాయించారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎంపీపీ రామచంద్రుడు, నాయకుడు గాందినగరం నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాటలకే చంద్రబాబు ప్రభుత్వం పరిమితం
ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి మైదుకూరు టౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలతోనే కాలం గడుపుతున్నారు తప్ప ఆచరణలో చేసిందేమీ లేదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. స్థానిక మండల కార్యాల యంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి 15నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అక్కడ భూములు ఇతర దేశాలవారికి లీజులకు ఇచ్చి పచ్చటి పొలాలను నాశ నం చేస్తున్నారని పేర్కొన్నారు. మన దేశంలోని ఇంజనీర్లపై నమ్మకం లేక సింగపూరు నుంచి ఇంజనీర్లను తెచ్చి రాజధాని నిర్మాణం చేపడుతామని చెబుతున్నారని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానన్న మాట పక్కనపెడితే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని విమర్శించారు. కేంద్రమం త్రి వెంకయ్య నాయుడు విభజన సమయంలో పార్లమెంటులో చెప్పిన మాటలు మరచి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీన తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. -
బాబు జైలుకెళ్లక తప్పదు
కడప: ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత లాగా జైలుకెళ్లక తప్పదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌జిల్లా కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం నగర మేయర్ కె. సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి. ర వీంద్రనాథ్రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణాలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సమగ్రవిచారణ జరిపితే ఆయన ఎంత అవినీతి పరుడో త్వరలోనే బయటపడుతుందని చెప్పారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిచ్చిపట్టిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఏమీ చేయకపోయినా చేసినట్లు చెప్పుకొంటున్నారని, ఇది కూడా ఒక రక మైన వ్యాధేనన్నారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నచందంగా రూపాయి ఖర్చుపెట్టకపోయినా కడప ఎయిర్‌పోర్టు నిర్మాణం తమ ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నేను మారిన మనిషిని అని పదేపదే చెబితే ప్రజలు చంద్రబాబుకు ఓట్లు వేశారని, ఈ ఏడాది పాలనతో ఆయన ఏమీ మారలేదని ప్రజలు గ్రహించారన్నారు. -
చెరువు కబ్జా
‘నీరు-చెట్టు’ ఆ చెరువుకు వర్తించదా? ఆక్రమణకు గురైన దుంపలగట్టు చెరువు అక్రమార్కులు టీడీపీ వర్గీయులు కావడంతో చేష్టలుడిగిన యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కడప : చెట్లు పెంచుదాం.. చెరువుల్ని సంరక్షిద్దాం.. పరిగెత్తే నీటికి నడక నేర్పించి నిలువరిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ‘నీరు-చెట్టు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. చెరువుల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే జిల్లాలో తద్భిన్నంగా చర్యలున్నాయి. టీడీపీ నేతలు చెరువులను సైతం ఆక్రమిస్తే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందిపోయి వారికి అండగా నిలుస్తోంది. పూడిక తీస్తే మట్టిని తరలించుకుంటామని రైతులు ముందుకు వస్తున్నా పట్టించుకునే స్థితిలో యంత్రాంగం లేదు. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు సమీపంలోని దుంపలగట్టు చెరువు భూమి సుమారు రెండు వందల ఎకరాలు ఆక్రమణకు గురైంది. కొందరు టీడీపీ నేతలు చెరువులో దశాబ్ధాలుగా ఉన్న చెట్లను తెగ నరికి పంట భూమిగా చదును చేశారు. చెరువులోనే బోర్లు వేసి పంటలు సాగు చేస్తున్నారు. అక్రమార్కులని తెలిసినా ట్రాన్స్ కో యంత్రాంగం విద్యుత్ కనెక్షన్లు సమకూరుస్తోంది. దాదాపు 200 ఎకరాల్లో వాణిజ్య పంటలు సాగు చేసి అధికార పార్టీ వర్గీయులు ఫలసాయం పొందుతున్నారు. ఎమ్మెల్యే ప్రశ్నించినా చర్యలు నిల్ దుంపలగట్టు చెరువు ఆక్రమణపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జెడ్పీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశాలల్లో అధికారులను నిలదీశారు. ఎన్నిమార్లు మీ దృష్టికి తీసుకవచ్చినా ఫలితం లేదని అధికారులపై ఆగ్రహం ప్రదర్శించారు. ఓ దశలో జడ్పీ సమావేశంలో బైఠాయించారు. కలెక్టర్ కెవి రమణ, జాయింట్ కలెక్టర్ రామారావు చర్యలు తీసుకుంటామని చెప్పి మిన్నకుండిపోయారు. ఆక్రమణదారులు అధికార పార్టీ అనుచరులు కావడంతోనే అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. దీంతో మరింతగా చెరువు భూమిని ఆక్రమించేందుకు అక్రమార్కులు సన్నద్ధమవుతున్నారు. నీరు-చెట్టు ఆ చెరువుకు వర్తించదా? ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం దుంపలగట్టు చెరువుకు వర్తించదా.. అని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువు మట్టిని భూములకు తరలించేందుకు సుముఖంగా ఉన్నామని చెబుతున్నా అధికారులు పనులు ప్రారంభించలేదని వాపోతున్నారు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నామని, అన్ని చెరువుల్లో పనులు ప్రారంభించాలని సాక్షాత్తు సీఎం చెప్పినా ఆ దిశగా చర్యలైతే లేవు.