కేసీ సాగునీటిపై స్పష్టత ఇవ్వండి | give clarity for kc irrigation water | Sakshi
Sakshi News home page

కేసీ సాగునీటిపై స్పష్టత ఇవ్వండి

Published Tue, Sep 20 2016 11:51 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

give clarity for kc irrigation water

చాపాడు:
    కడప–కర్నూలు సాగునీటి సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణను కోరారు. కేసీ కెనాల్‌ సాగునీటి సరఫరాపై ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవటంతో గత నెల రోజులకు పైగా సాగునీరు వస్తుండటంతో కేసీ ఆయకట్టు రైతులంతా మమ్మురంగా వరి సాగు చేసుకుంటున్న నేపథ్యంలో రఘురామిరెడ్డి కడపలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 90 శాతం ఆయకట్టు కేసీ సాగునీటిపై ఆధారపడి ఉందని,  రైతులంతా 70శాతం మేరకు వరి సాగు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం సాగునీటి సరఫరాపై ఎలాంటి ప్రకటన చేయలేదని, రైతుల ఆవేదన దష్టిలో ఉంచుకుని నీటి సరఫరాపై ప్రకటన చేయాలన్నారు. జనవరి 15వ తేది వరకూ ఏకధాటిగా కేసీ కాలువలకు సాగునీరు ఇవ్వాలని, లేకపోతే వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతుందని ఆయన కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement