కడప కల్చరల్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ సంవత్సరం నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు రెవెన్యూ, దేవాదాయశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులకు ఆయన గురువారం ప్రత్యేకంగా లేఖ రాశారు.
ఒంటిమిట్ట ఆలయ కార్యనిర్వహణాధికారి సమర్పించిన ప్రతిపాదనలను తాము ప్రభుత్వానికి పంపామని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్రం విడిపోకముందు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రామాలయంలో ప్రభుత్వంశ్రీరామనవమి వేడుకలను నిర్వహించేది. ప్రస్తుతం ఆ ఆలయం తెలంగాణకు దక్కగా, రాష్ర్టంలోని అత్యంత పురాతమైన, ఎన్నో విశిష్టతలుగల ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలోనే ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ లేఖ ద్వారా కోరారు.
ఒంటిమిట్టలోనే ఉత్సవాలకు కలెక్టర్ సిఫార్సు
Published Fri, Feb 6 2015 1:40 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement