KV Ramana
-
‘అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు.. అది ఈ శతాబ్ది అబద్ధం’
చంద్రబాబు నాయుడు ఇటీవల టీడీపీ సభ్యత్వం తీసుకుంటూ ‘అందరి మూలాలూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయ’ని చెప్పడం ఈ శతాబ్ది అబద్ధం. ‘అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన ఇతనికి అబద్ధం చెప్పకపోతే తల వేయి ముక్క లవుతుందని ముని శాపం’ ఉందని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పేవారు. అది నిజమేనని బాబు ప్రతి రోజూ రుజువు చేసుకుంటూనే ఉన్నారు. ఈయన మూలాలే కాంగ్రెస్‌వి అయితే, అందరి మూలాలూ తెలుగుదేశానివి ఎలా అయ్యాయి?ప్రజా ప్రయోజనాలు, వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి... ఈయనా, ఈయన వందిమాగధులూ తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాదును తానే నిర్మించానని గొప్పలు చెప్పుకొంటూ ఉంటారు బాబు. అటువంటప్పుడు ఆయన పార్టీ తెలంగాణలో ఎందుకు నామరూపాలు లేకుండా పోయింది? రెండు తెలుగు రాష్ట్రా లలోనే లేని తెలుగుదేశం పార్టీని... జాతీయపార్టీ అని ఎలా అనగలుగుతున్నారో అర్థం కాదు.కార్యకర్తల కోసమే పుట్టిన పార్టీగా టీడీపీ అధినాథుడు తన పార్టీ గురించి చెప్పుకొంటారు. మరి 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికి పోయారు? పోటీ చేయడానికి కూడా ఎందుకు సాహసించలేక పారిపోయారు? లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకోవడమే బాబు గొప్పతనం. అధికారాన్ని కట్ట బెట్టిన ఇటీవలి ఎన్నికల్లో పాత్ర పోషించింది కార్యకర్తలా, ఈవీఎంలా అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానాలి. కాంగ్రెస్ నుంచి వచ్చి, ఎన్టీ రామారావు నుంచి టీడీపీని లాగేసుకుని, ఎన్టీఆర్ మూలాలను పార్టీలో లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబని ఎవరికి తెలియదు? సమస్యలను పక్కదారి పట్టించే నేర్పరితనాన్ని పక్కన పెట్టి, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. వైఎస్సార్ సీపీ పాలనకు అలవాటుపడ్డ జనం టీడీపీ పాలన పట్ల ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్నారు. లేనిపోని అబద్ధపు ప్రచారం మాని ప్రజలను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.– కె.వి. రమణ ‘ వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఘనంగా నిత్యాన్వేషణం పుస్తకావిష్కరణ..
సాక్షి, హైదరాబాద్: ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచించిన ‘నిత్యాన్వేషణం’ (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం) గ్రంథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం డాక్టర్ కేవీ రమణ సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ‘నిత్యాన్వేషణం’ గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘మూసీ’ సాహిత్య ధ్వార ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డీ రవీందర్, ఆచార్య డీ సూర్యా ధనుంజయ్ విశిష్ట ఆతిథులుగా హాజరయ్యారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లక్కరాజు రవీందర్ కృతిని స్వీకరించారు. వక్తలు మాట్లాడుతూ నిత్యాన్వేషణ సాగిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేలా అద్భుతమైన సాహిత్య వ్యాసాలను నిత్యానందరావు వెలువరించారని, ఆయన నిరంతర సాహిత్య కృషికి, పరిశీలనా, అనుశీలనా దృష్టికి ‘నిత్యాన్వేషణం’ గ్రంథం నిదర్శనమని కొనియాడారు. -
ఎందుకీ నిర్లక్ష్యం?
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా కలెక్టర్ కేవీ రమణ వైఖరి శనివారం మరోమారు ప్రస్ఫుటమైంది. కొన్ని నెలలుగా తరచూ వివాదాస్పదమవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి ఆయన అర్ధంతరంగా అధికారులను వెంటబెట్టుకుని వెళ్లిపోయారు. జిల్లాలో ప్రజలు వివిధ సమస్యలతో తల్లడిల్లుతున్న సమయంలో అర్థవంతంగా నిర్వహించాల్సిన సమావేశం అర్ధంతరంగా వాయిదా పడింది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన యంత్రాంగం తద్భిన్నంగా వ్యవహ రించడమే ఇందుకు కారణమైంది. శనివారం నాటి జెడ్పీ సమావేశంలో హక్కుల ఉల్లంఘనకు పాల్పడరాదని ప్రజాప్రతినిధులు కోరారు. జెడ్పీ చైర్మన్ అనుమతితో చర్చ లేవనెత్తారు. చర్చ నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. ప్రజాప్రతినిధులుగా వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందిపోయి, చులకన భావంతో అడ్డగించడమే వివాదానికి మూలమైంది. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు భాగం. ఈ అంశం అధికారులకు తెలియని విషయం కాదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక్క పార్టీకే పరిమితం కాదు. రాష్ట్రంలో అందరికీ చెందిన వాడు. సీఎం అధికారికంగా ఆయనకు పర్యటిస్తే ప్రొటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం ఉండాలి. అది వారి హక్కు. తమ హక్కులకు భంగం కల్గించొద్దని పదేపదే ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. ఒక్కమారు పొరపాటు జరిగింటే మరోమారు ఆ పొరపాటుకు ఆస్కారం లేకుండా చూడడం దక్షత కల్గిన పాలకుల విజ్ఞతగా పరిశీలకులు భావిస్తున్నారు. అదే అంశం పదేపదే ఉత్పన్నమౌతుంటే ప్రజాప్రతినిధులుగా వారి హక్కులపై పోరాటం చేయడంలో ఏమాత్రం తప్పిదం కాదని పలువురు వివరిస్తున్నారు. గండికోట ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి వస్తే, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేదు. పెపైచ్చు వాస్తవ పరిస్థితులను వివరిస్తామని స్వయంగా ఎందుకీ నిర్లక్ష్యం? మొరపెట్టుకున్నారు. అవకాశం కల్పించాల్సిందిపోయి, 300 మంది పోలీసులతో ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో జిల్లా ప్రజా ప్రతినిధులను, అఖిలపక్షంను అడ్డుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా కమలాపురం పర్యటనకు సీఎం వస్తే.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఆహ్వానమే లేదు. ఖాజీపేటలో జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆహ్వానం అందలేదు. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులుగా లేవనెత్తితే అజెండాలోని అంశం కాదని దాటవేత ధోరణి వ్యక్తమైంది. ప్రజాప్రతినిధులకు వ్యక్తిత్వం ముఖ్యం కాదా.. అన్న ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన పాలకులు ఎదురుదాడి చేయడం ఏమేరకు సబబు అని వారు నిలదీస్తున్నారు. మీడియా పట్ల నిరంకుశమే.. జిల్లా పరిషత్ సమావేశం నుంచి కలెక్టర్ అర్ధంతరంగా నిష్ర్కమించడంతో జిల్లా అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. ఎందుకు సమావేశం నుంచి వెళ్లిపోతున్నామనే విషయాన్ని అక్కడ అధికారులు ప్రకటించలేదు. సాయంత్రం ఐదున్నర్ర గంటలకు కలెక్టర్.. సభా భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన చెప్పాల్పిందంతా చె ప్పాక, మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి ఆయన సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి బయలుదేరారు. మీడియా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో ఉండడమే అందుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం తాను చెప్పిందే, సూచించిందే కరెక్టు అన్న ధోరణి వల్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కల్గుతోందని పలువురు వివరిస్తున్నారు. ఎవరిది నియంతృత్వమో తాము చ ర్చకు సిద్ధమని మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి సవాల్ విసిరారంటే యంత్రాంగం డొల్లతనం తేటతెల్లం అవుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తా : జిల్లా కలెక్టర్ తనను లక్ష్యంగా చేసుకుని జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు దూషణలకు దిగడం దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ కె.వి. రమణ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఇటీవల నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో బద్వేలు ఎమ్మెల్యే జయరాములు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తాను పని చేస్తానన్నారు. లింగాల మండలం మురారి చింతల గ్రామంలో జన్మభూమి సందర్భంగా అధికారులను మూడు గంటల పాటు నిర్బంధించారని తెలిపారు. ఇలా వ్యవహరించి పనులు చేసుకోగలమని భావించడం సరికాదన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం. రామారావు మాట్లాడుతూ కలెక్టర్‌ను టార్గెట్ చేసి ప్రజాప్రతినిధులు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనల గురించి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించనున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో రెండవ జాయింట్ కలెక్టర్ చంద్రశేఖరరెడ్డి, డీఆర్ఓ సులోచన, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఈ కలెక్టర్ మాకొద్దు
సాక్షి ప్రతినిధి, కడప: జెడ్పీటీసీ నుంచి జడ్పీ చైర్మన్ వరకు.. ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే వరకూ, కార్యకర్త నుంచి ఆయా పార్టీల జిల్లా అధ్యక్షుల వరకు.. తుదకు ప్రజాసంఘాలు సైతం ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చి.. విజ్ఞత ఉన్న కలెక్టర్‌ను నియమించండని నినదించారు. ఈ కలెక్టర్‌ను వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చ అంతా కలెక్టర్ వ్యవహార శైలిపైనే సాగింది. సమావేశానికి కలెక్టర్ కెవీ రమణ హాజరు కాలేదు. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ రామారావు హాజరయ్యారు. ‘జిల్లాలో 48 మండలాలను కరువు మండలాలుగా గుర్తించారు.. సుమారు 500 గ్రామాలల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర ఉంది.. కూలీలకు ఉపాధి లేక వలసబాట పట్టారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకంటే ముఖ్యమైన సమస్య ఏముంది.. ఈ సమావేశానికి కలెక్టర్ హాజరు కాలేదంటే ప్రజాప్రతినిధులను అవమాన పరచడమే’ అనిఎమ్మెల్యేలు సి ఆదినారాయణరెడ్డి, పి రవీంద్రనాథరెడ్డి, జి శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, టి జయరాములు, ఎస్బి అంజాద్‌బాషలు అభిప్రాయపడ్డారు. జిల్లాకు పారిశ్రామికవేత్తలు రావాలంటే ఇక్కడి ప్రజలు ఆవేశపరులని భయపడుతున్నారని కలెక్టర్ ప్రకటించడం క్షమార్హం కాదన్నారు. ప్రజల్ని అవమానపర్చిన కలెక్టర్‌పై చర్చించాలని, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆప్, వైఎస్సార్సీపీ, బిజెపి, మానవ హక్కుల వేదిక, రాయలసీమ కార్మిక కర్షక సమితి, రైతు సంఘాల ప్రతినిధులు అఖిలపక్షంగా ఏర్పడి జడ్పీ చైర్మన్ గూడూరు రవి, శాసనమండలి డిప్యూటి చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, టీడీపీ విప్ మల్లికార్జునరెడ్డిలకు వినతిపత్రాలిచ్చారు. అనంతరం జెడ్పీ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లి ధర్నా చేపట్టారు. కలెక్టర్ డౌన్‌డౌన్.. ప్రజాద్రోహి కలెక్టర్.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ను వెనక్కు పిలిపించండి.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి జిల్లాకు విధుల నిమిత్తం వచ్చిన కలెక్టర్లు బదిలీపై వెళ్తూ జిల్లా ప్రజల్ని ప్రశంసించిన చరిత్ర ఉంద న్నారు. ప్రజల పట్ల బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ను మొదటిసారి చూస్తున్నామని తెలిపారు. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న కలెక్టర్‌ను నియమించాలని నేతలందరూ ముక్తకంఠంతో కోరారు. జిల్లా కలెక్టర్‌ను తక్షణం వెనక్కి పిలిపించి ఉన్నత వ్యక్తిత్వం కల్గిన ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహమ్మద్, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు, ఈశ్వరయ్య, రైతు సంఘాల నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, ఆప్ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, బిసీ సంఘాల నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కోదండరామాలయ ప్రగతికి మాస్టర్ ప్లాన్
ఒంటిమిట్ట: గత కొంత కాలంగా మండల ప్రజలు కోరుకుంటున్న అధికారిక బ్రహ్మోత్సవాల శోభ శుక్రవారం ఒంటిమిట్టను తాకింది. స్థానిక కోదండరామాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ ఏవీఎస్ ప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ శుక్రవారం పరిశీలించారు. వీరు ముందుగా కోదండరామున్ని దర్శించుకున్నారు. వీరి రాక సందర్భంగా పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కోదండరామాలయానికి అధికారిక హోదా తీసుకొస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానిక భక్తులు, నాయకులు, ప్రజలు పూలతో స్వాగతం పలికారు. అనంతరం కోదండరామాలయ పరిసర ప్రాంతాలను, ఆలయానికి సంబంధించిన భూములను ప్రిన్సిపాల్ సెక్రటరీ పరిశీలించారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ, ప్రభుత్వ మేడా విలేకరులతో మాట్లాడుతూ ప్రాచీన ఆలయమైన ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఎలాంటి నూతన కట్టడాలకు తావులేదన్నారు. ఆలయ స్థితిని యధావిధిగానే కొనసాగించాలన్నారు. దేవాలయంలో ఒక పద్ధతి ప్రకారం పూజలు నిర్వహించాలని సూచించారు. ఆలయానికి ఇచ్చే కానుకలను నగదు రూపంలో అందించాలని తెలియచేశారు. ఆలయంలో దాతల పేర్ల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయకూడదని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టే కట్టడాలను ఎక్కడికక్కడ ఆపాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ద్వారా ఒంటిమిట్ట కోదండరామాలయం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆలయంలో పాడుబడ్డ శిల్పాలను మద్రాసులోని ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలచే మరమ్మతులు చేయిస్తామన్నారు. ఘనంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగే బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ రెవెన్యూ, ఎండోమెంట్ ప్రిన్పిపల్ ఏవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఇందు కోసం ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు, ప్రజలతో ఆయన చర్చించారు. ఒంటిమిట్ట కోదండరామాలయం రాబోయే కాలంలో ఒక గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పర్యాటకరంగంపై ప్రత్యేక దృష్టి ముఖ్యంగా మండలంలో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ప్రిన్సిపాల్ సెక్రటరీ వె ల్లడించారు. కోదండరామాలయానికి ఆనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించడం వలన ఒంటిమిట్టలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కోదండరామాలయానికి వచ్చే యాత్రికులకు ప్రత్యేక వసతి కల్పించడం ద్వారా పర్యాటక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. మండల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఒంటిమిట్ట మండలంతో పాటు జిల్లాను మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. భావి తరాలపై పురాతన ఆలయాల చరిత్ర తెలుసుకునే విధంగా ఆలయాలను యధాస్థితిలో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన భవనాలను, ఆలయసమీపంలోని హరితా రెస్టారెంట్‌ను, కోదండరామాలయ భూములను, రామలక్ష్మణ తీర్థాలను పరిశీలించారు. వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్, వీఐపీలకు ఏర్పాట్లు, భక్తుల ఏర్పాట్లపై చర్చించారు. వీటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. స్థానిక ప్రజలు, భక్తులసహకారంతో అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు, నాయకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ఒంటిమిట్టలోనే ఉత్సవాలకు కలెక్టర్ సిఫార్సు
కడప కల్చరల్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ సంవత్సరం నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు రెవెన్యూ, దేవాదాయశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులకు ఆయన గురువారం ప్రత్యేకంగా లేఖ రాశారు. ఒంటిమిట్ట ఆలయ కార్యనిర్వహణాధికారి సమర్పించిన ప్రతిపాదనలను తాము ప్రభుత్వానికి పంపామని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్రం విడిపోకముందు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రామాలయంలో ప్రభుత్వంశ్రీరామనవమి వేడుకలను నిర్వహించేది. ప్రస్తుతం ఆ ఆలయం తెలంగాణకు దక్కగా, రాష్ర్టంలోని అత్యంత పురాతమైన, ఎన్నో విశిష్టతలుగల ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలోనే ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ లేఖ ద్వారా కోరారు. -
13 మధ్యాహ్నంలోగా సంక్రాంతి కానుక
కడప సెవెన్‌రోడ్స్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా అందిస్తున్న ఆరు రకాల సరుకులను ఈనెల 13వ తేదీ మధ్యాహ్నంలోగా పంపిణీ చేయాలని తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,03,114 మంది తెల్లరేషన్కార్డుదారులున్నారన్నారు. వీరికి 1735 చౌక దుకాణాల ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుక కింద అర కిలో కందిపప్పు, అర లీటరు పామోలిన్, కిలో శనగపప్పు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, నూరు గ్రాముల నెయ్యి ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పేదలకు అందిస్తున్న ఆరు వస్తువులను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అవసరమైన పక్షంలో స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. అలాగే వివరాలతో కూడిన ఫ్లెక్సీలను పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలకు కనబడే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రభాకర్‌రావు, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ బొల్లయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అందుబాటులో డెంగీ జ్వర నిర్ధారణ కిట్లు
కడప అర్బన్ : జిల్లాలో డెంగీ జ్వర నిర్ధారణకు అవసరమయ్యే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆరోగ్య కేంద్రం, రిమ్స్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ‘జిల్లాలో డెంగీ జ్వరాలు-నియంత్రణ, దోమల నివారణ’పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు, వైద్య విధాన పరిషత్ , రిమ్స్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చ భారత్ కార్యక్రమం ఇంటినుంచే ప్రారంభించాల్సి ఉందన్నారు. క్లస్టర్ల స్థాయిలో కన్వర్జెన్స్ కమిటీ సమావేశాలుఏర్పాటు చేసి డ్రైడే..ఫ్రైడే నినాదాన్ని ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్‌ప్రభుదాస్ మాట్లాడుతూ టైగర్ దోమ వల్ల డెంగీ జ్వరం వస్తుందన్నారు. ఇది పగటిపూట సంచరిస్తూ ఉంటుందని తెలిపారు. అరుుతే అంటువ్యాధి కాదన్నారు. డెంగీ రోగికి కుట్టిన దోమ మరో వ్యక్తికి కుట్టినపుడు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. మనిషి రక్తంలో రెండు లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 20 వేలకు తగ్గినపుడు మాత్రం అలాంటి రోగికి ప్లేట్లెట్స్ ఎక్కించడం జరుగుతుందన్నారు. రక్తం నుంచి ప్లేట్లెట్స్ సపరేట్ చేయడానికి అవసరమైన పరికరాలు రిమ్స్‌లో ఉన్నాయన్నారు. డెంగీ జ్వరాన్ని తగ్గించడానికి ప్రత్యేకించి ఎలాంటి మందులు అవసరం లేదన్నారు. జిల్లా అదనపు జేసీ సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం,ఐసీడీఎస్ పీడీ లీలావతి, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్, వైద్య విధాన పరిషత్ సమన్వయ అధికారి డాక్టర్ రామేశ్వరుడు, జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి పాల్గొన్నారు. రక్త కణాలు తగ్గిపోతున్న కేసులే ఎక్కువ ప్రొద్దుటూరు టౌన్: మలేరియా జ్వరాలకంటే రక్త కణాలు తగ్గుతున్న కేసులు ఎక్కువగా వస్తున్నాయని ప్రైవేటు వైద్యులు ఆర్ఎంఓ బుసిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణలకు వివరించారు. మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని సూపర్‌బజార్ రోడ్డులో ఉన్న వైద్యులు రంగారెడ్డి ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి కేసులు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. క్రిటికల్ మలేరియా చాలా తక్కువగా ఉందన్నారు. వైరల్ జ్వరాలు వస్తున్నా ఆ శాతం కూడా చాలా తక్కువగానే ఉందన్నారు. ప్లేట్లేట్స్ తగ్గినవన్నీ డెంగీ కేసులు కావని, మలేరియా, చికున్‌గున్యా, దగ్గుతో కూడిన జ్వరం వచ్చినా ప్లేట్లేట్స్ తగ్గిపోతాయని వైద్యులు వివరించారు. -
ఆయనొద్దు..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఈ కలెక్టర్ మామాట వినట్లేదు.. మేము ఒకటి చెబితే ఆయన ఇంకొటి చేస్తున్నారు. పదేళ్లుగా అధికారం లేదు.. ఇప్పుడన్నా నచ్చినోళ్లను కావాల్సిన సీట్లల్లోకి తెచ్చుకుందామంటే అడ్డుకొర్రీలు వేస్తున్నారు.. అధికారంలో ఉన్నప్పుడన్నా మాది పైచేయి కావాలి..కదా! కడప ఆర్డీఓగా మేము అనుకున్న వాళ్లను కాదని, ఆయనో పేరును సిఫార్సు చేశారు.. తహశీల్దార్ల నియామకాల్లో కూడా సిఫార్సులకు అనుగుణంగా పోస్టింగ్‌లు ఇవ్వలేదు.. ఈయనే ఉంటే మాకు ఇబ్బందే,. బదిలీ చేయించండి.’.. జిల్లాలో ప్రస్తుతం తెలుగుతమ్ముళ్ల మధ్య నడుస్తున్న సంభాషణ ఇది. జిల్లా కలెక్టర్‌గా కేవీ రమణ ఈ ఏడాది జూలై 14న బాధ్యతలు చేపట్టారు. అనతికాలంలోనే అత్యంత సున్నితంగా ఫైళ్ల పరిశీలన చేస్తూ తనదైన శైలిలో విధులు నిర్వర్తిస్తున్నారు. దశాబ్ధాల తరబడి పెండింగ్‌లో ఉన్న మైనింగ్ బకాయిల సత్వర వసూళ్లకు చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. ప్రతి అంశంపై అవగాహన పెంచుకునే దిశగా క్షుణ్ణంగా చర్చిస్తూ, సమగ్రంగా పరిశీలన చేస్తున్నారు. మొదట్లో అధికారులలో కొంత వ్యతిరేకత వ్యక్తమయినా ప్రస్తుతం సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే కలెక్టర్ తీరు తెలుగు తమ్ముళ్లకు మింగుడుపడటం లేదు. కడప ఆర్డీఓ నియామకంలో పీటముడి.... జిల్లాలో ఆర్డీఓ నియామకాల్లో అధికార పార్టీ నేతలు వారికి అనువైన అధికారులను నియమించుకునేందుకు పావులు కదిపారు. ఆమేరకు అక్కడి నాయకుల సిఫార్సులకు అనుగుణంగా జమ్మలమడుగు, రాజంపేట ఆర్డీఓల నియామకాలు చోటు చేసుకున్నాయి. కడప ఆర్డీఓ నియామకంపై పీటముడి పడింది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న లవన్నను కొనసాగించాలని టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానాన్ని వరప్రసాద్ అనే అధికారితో భర్తీ చేయాలని కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తానరసింహారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వరప్రసాద్ జిల్లావాసి కావడంతో నియామకం పెండింగ్‌లో పడినట్లు సమాచారం. ఈపరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కృష్ణారావు జిల్లా కలెక్టర్ అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. వారిద్దరికంటే రాజంపేటలో పనిచేసి బదిలీపై వెళ్లిన విజయసునీత సముచితంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ నివేదికను అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్‌పై తెలుగుతమ్ముళ్లు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తాము ఒకటి తలిస్తే కలెక్టర్ ఇంకొకటి చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కోటరీలో ఉన్న ఓ నాయకుని వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. తహశీల్దార్ల నియామకాల్లో కూడా తాము సూచించిన వారిని కాదని కలెక్టర్ కొందరిని మార్చారని ఆ నేత ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే జిల్లా పరిస్థితుల పట్ల కలెక్టర్ సమగ్ర అవగాహన పెంచుకుంటూ పోతున్న తరుణంలో బదిలీ చేయాల్సిందేనని తెలుగుతమ్ముళ్లు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. బిజీగా బిజీగా ఉంటూనే... ఒకటి రెండు వివాదాస్పద అంశాలను మినహాయిస్తే తన పని తాను చేసుకుంటూ జిల్లా కలెక్టర్‌గా కేవీ రమణ బిజీబిజీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బదిలీ చేయాలనే దిశగా తెలుగుతమ్ముళ్లు పావులు కదపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పట్టుమని మూడు నెలలు కూడా గడవకమునుపే కలెక్టర్‌పై వ్యతిరేకత ప్రదర్శించడం ఏమాత్రం సరైంది కాదని పలువురు భావిస్తున్నారు. -
కృష్ణమ్మా.. రావమ్మా
సాక్షి, కడప: జిల్లాలోని మైలవరం రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు కలెక్టర్ కేవీ రమణ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా అవుకు రిజర్వార్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చి అక్కడి నుంచి ఐదు టీఎంసీల నీటిని గండికోట ప్రాజెక్టుకు తీసుకొస్తున్నారు. అయితే మైలవరం ప్రాజెక్టుకు తుంగభద్ర జలాలు రాక ప్రతి ఏడాది ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మైలవరం రిజర్వాయర్‌కు తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటి కోటా ఉది. ఈ నీరు మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి 150 కిలోమీటర్లు హై లెవెల్ కెనాల్ ద్వారా కొంతదూరం ప్రయాణించి ఆ తర్వాత పెన్నానదిలో ప్రవహించిన అనంతరమే మైలవరం చేరాల్సి ఉంటుంది. దీంతో తుంగభద్ర నుంచి ఎప్పుడు కూడా మైలవరానికి సక్రమంగా నీరు వచ్చిన దాఖలాలు లేవు. పైగా పెన్నానది ఎండిపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నీరు రావడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మైలవరం రిజర్వాయర్‌పై ఆధారపడి ఉన్న ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీ ప్రజలతోపాటు మైలవరం మండల ప్రజలకు తాగునీరు అందించాలంటే కచ్చితంగా కృష్ణా జలాల అవసరముందని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సోమవారం పంపించారు. గతంలో కూడా రెండుమార్లు జలాలు మైలవరం రిజర్వాయర్‌కు గతంలో కూడా రెండుసార్లు శ్రీశైలం ప్రాజెక్టు రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు వచ్చినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సమస్య ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా కృష్ణా జలాల అవసరాన్ని అధికారులు గుర్తించారు. కనీసం మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తే సమస్య లేకుండా పోతుందని భావిస్తున్నారు. సాగునీరు దేవుడెరుగు మొదటి విడతగా తాగునీటిని తెచ్చుకుంటే చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గండికోట ప్రాజెక్టుకు ఐదు టీఎంసీల నీటిని కేటాయించిన నేపథ్యంలో వాటితో సంబంధం లేకుండా మైలవరానికి తుంగభద్ర జలాలకు బదులు కృష్ణా జలాలు అందించాలని అధికారులు కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు తుంగభద్ర కోటా కింద మైలవరానికి వచ్చే నీరు ప్రతిసారి పెన్నానదిలో ఇంకిపోతూ అనంతపురం జిల్లా ప్రజలకు అంతో ఇంతో లాభం చేకూరేది. తద్వారా అక్కడి ప్రజలకు బోరుబావులు రీఛార్జి కావడంతో పాటు, తాగునీటి సమస్య కూడా సమీప గ్రామాల్లో లేకుండా వస్తోంది. అయితే అనవసరంగా మైలవరం కోటా నీరు వృథా కాకుండా కలెక్టర్ కేవీ రమణ తుంగభద్ర జలాల బదులు కృష్ణా జలాలు తీసుకు రావాలని సంకల్పించడం మంచి నిర్ణయమే. కలెక్టర్ కేవీ రమణతో చర్చించిన ఇన్‌ఛార్జి ఈఈ రాజశేఖర్ పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఈఈగా పనిచేస్తూ మైలవరం ప్రాజెక్టు ఇన్‌ఛార్జి ఈఈగా పనిచేస్తున్న రాజశేఖర్‌తో జిల్లా కలెక్టర్ కేవీ రమణ సోమవారం ప్రత్యేకంగా చర్చించారు. ప్రధానంగా తుంగభద్ర నుంచి మైలవరానికి వచ్చే నీటి కోటా విషయంతోపాటు కృష్ణా జలాల విషయమై కూడా వారిరువురు మాట్లాడుకున్నారు. మైలవరానికి కృష్ణా జలాలు మూడు టీఎంసీలు అవసరమని కలెక్టర్ కేవీ రమణ ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. -
ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు పెంచండి
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్స లు పెంచాలని కలెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఆయన మొదటి అంతస్తులోని ఎస్ఎన్సీయూ వార్డును సందర్శించారు. వార్డులో చిన్నపిల్లలకు ఎలాంటి సేవలు చేస్తున్నారని సిబ్బందితో ఆరా తీశారు. ఆస్పత్రిలోని శుభ్రత, వైద్య సేవలపై సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రహరీ చాలా తక్కువ ఎత్తులో ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్థోతోపాటు ఇతర శస్త్ర చికిత్సలు కూడా చేయాలని కలెక్టర్ సూచించారు. ఆస్పత్రిలో సౌకర్యాలను పూ ర్తిస్థాయిలో మెరుగుపరుస్తామని కలెక్టర్ జిల్లా ఆస్పత్రి వైద్యాధికారులకు తెలిపారు. ముఖ్యం గా సిజేరియన్లు రెగ్యులర్‌గా నిర్వహించాలని సూపరింటెండెంట్ ఎస్ఎన్మూర్తితో పేర్కొన్నారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రఘునాథరెడ్డి, తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డి, ఆర్ఎంఓ బుసిరెడ్డి పాల్గొన్నారు. తక్కువ జీతంతో చాలా కాలంగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం కలెక్టర్ కేవీ రమణను కోరారు. ఈ సందర్భంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రామ్మోహన్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. చాపాడు: ప్రభుత్వాధికారులు ఎలాంటి చిన్న తప్పులు చేసినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కేవీ రమణ హెచ్చారించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా మంగళవారం సాయంత్రం చాపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, రెవెన్యూ కార్యాలయం, పీహెచ్‌సీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ను జెడ్పీటీసీ బాలనర సింహారెడ్డి, బీసీ మండల కన్వీనర్, ఎంపీపీ కొండమ్మ భర్త బిర్రు రామచంద్రయ్య, చియ్యపాడు-2 ఎంపీటీసీ మహేష్‌యాదవ్ కలిశారు. పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రొద్దుటూరు కల్చరల్: విద్యార్థులు స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ కేవీ రమణ సూచించారు. స్థానిక పెన్నానదీ తీరంలోని త్యాగరాజరెడ్డి కల్యాణ మండపంలో మంగళవారం రామకృష్ణమిషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్ ఫార్మిం గ్ యూత్ టు ట్రాన్స్ఫార్మ ఇండియా యూత్ కన్వెన్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుని అడుగు జాడల్లో నడచి దేశాభ్యున్నతికి కృషి చేయాలని విద్యార్థులను కోరారు. సీనియర్ సివిల్‌జడ్జి ప్రభాకరరావు మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను, నీతి, నిజాయితీ, సేవా కలిగి ఉం డాలన్నారు. హైదరాబాదుకు చెందిన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డెరైక్టర్ బోధమాయానంద మహరాజ్, వక్త శివాజీ శంకర్ మాట్లాడారు. -
ప్రభుత్వ సలహాదారులకు శాఖల కేటాయింపు!
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులుగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆర్.విద్యాసాగరరావుకు నీటి పారుదలశాఖ కేటాయించగా, ఏకే.గోయల్ కు ప్రణాళిక, విద్యుత్‌శాఖ.. ఏ.రామ లక్ష్మణ్ కు సంక్షేమశాఖను, బీవీ పాపారావుకు విధానపరమైన విషయాలు, సంస్థాగత అభివృద్ధి శాఖలను, జీఆర్ రెడ్డి-ఆర్ధికశాఖ, కేవీ రమణాచారిలకుసంస్కృతి, పర్యాటకం, దేవాదాయ, యువజన, మీడియా వ్యవహారాల శాఖలను కేటాయించారు.