ఈ బిల్లుల భారం మోయలేం | current bills heavy | Sakshi
Sakshi News home page

ఈ బిల్లుల భారం మోయలేం

Nov 8 2016 12:56 AM | Updated on Sep 4 2017 7:28 PM

ఈ బిల్లుల భారం మోయలేం

ఈ బిల్లుల భారం మోయలేం

చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్‌ బిల్లులు భారీగా వస్తున్నాయని అంత బిల్లు తాము ఎలా చెల్లించాలని పలువురు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఖాజీపేట మండలం పాత ఏటూరు, కొత్త ఏటూరు గ్రామాల్లో గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు

 

ఖాజీపేట: చంద్రబాబు  ప్రభుత్వంలో విద్యుత్‌ బిల్లులు భారీగా వస్తున్నాయని అంత బిల్లు తాము ఎలా చెల్లించాలని పలువురు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఖాజీపేట మండలం పాత ఏటూరు, కొత్త ఏటూరు గ్రామాల్లో గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే రఘురామిరెడి​‍్డతో మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో తమకు ఉచితంగా విద్యుత్‌ ఇచ్చేవారని, నేడు భారీగా విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని తెలిపారు. పూట గడవడమే కష్టంగా ఉన్న తాము ఇంత బిల్లులు చెల్లించలేమని వారు ఎమ్మెల్యేకు చెప్పి వాపోయారు.
బాబు చెప్పేదొకటి.. చేసేదొకటి.
దళితుల ఆవేదనపై స్పందించిన ఎమ్మెల్యే రఘురామిరెడి​‍్డ మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేదొకటి చేసేది మరొకటి అని విమర్శించారు. దళితులం‍టే చంద్రబాబుకు చిన్న చూపన్నారు. ఓట్ల కోసం ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ జనార్ధన్‌రెడ్డి, మాజీ ఉప మండలాధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దస్తగిరిబాబు, యూత్‌ కన్వీనర్‌ మద్దిక నాగేశ్వర్‌రెడ్డి, త్రిపురవరం సర్పంచ్‌ కృష్ణారెడ్డి, ఏటూరు సర్పంచ్‌ భర్త రాజగోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు చిన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, త్రిపురవరం నాగసుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ గాలిపోతు మనోహర్‌, అంబటి శివారెడ్ది తోపాటు మండలంలోని నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement