మాటలకే చంద్రబాబు ప్రభుత్వం పరిమితం | MLA settipalle raghurami Reddy fires on chandrababu | Sakshi
Sakshi News home page

మాటలకే చంద్రబాబు ప్రభుత్వం పరిమితం

Published Thu, Aug 27 2015 3:10 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

మాటలకే చంద్రబాబు ప్రభుత్వం పరిమితం - Sakshi

మాటలకే చంద్రబాబు ప్రభుత్వం పరిమితం

ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి
 
 మైదుకూరు టౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలతోనే కాలం గడుపుతున్నారు తప్ప ఆచరణలో చేసిందేమీ లేదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. స్థానిక మండల కార్యాల యంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి 15నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అక్కడ భూములు ఇతర దేశాలవారికి లీజులకు ఇచ్చి పచ్చటి పొలాలను నాశ నం చేస్తున్నారని పేర్కొన్నారు.

మన దేశంలోని ఇంజనీర్లపై నమ్మకం లేక సింగపూరు నుంచి ఇంజనీర్లను తెచ్చి రాజధాని నిర్మాణం చేపడుతామని చెబుతున్నారని తెలిపారు.  ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానన్న మాట పక్కనపెడితే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని విమర్శించారు. కేంద్రమం త్రి వెంకయ్య నాయుడు విభజన సమయంలో పార్లమెంటులో చెప్పిన మాటలు మరచి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.  ఈనెల 29వ తేదీన తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement