హోదా కోసం ‘ప్రత్యేక’ ధర్నా
Published Thu, Oct 6 2016 12:06 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
కర్నూలు(న్యూసిటీ): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బుధవారం కల్టెరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాయలసీమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోహం చేస్తున్నాయని సీపీఎం రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ జి.ఓబులు విమర్శించారు. సీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బుందేల్‌ఖండ్ తరహాలో ప్యాకేజీని అమలు చేయాలన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం, అనంతపురంలో కేంద్రియ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లాలో కేంద్ర రంగ ప్రభుత్వ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.50 వేల కోట్లు కేటాయించాలన్నారు. హంద్రీనీవా, గాలేరి నగరి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్ అధ్యక్షతన ధర్నాలో సీపీఎం జిల్లా నాయకులు బి.రామాంజనేయులు, ఎం.నాగేశ్వర రావు, పి.ఎస్.రాధాకృష్ణ, టి.చంద్రుడు, సీపీఎం నగర నాయకులు ఎం.నాగరాజు, గురుశేఖర్, టి.రాముడు, షరీఫ్, రాజశేఖర్, నరసింహులు, ఎం.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement