Published
Mon, Sep 26 2016 10:13 PM
| Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కోదాడ : తెలంగాణలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై యూత్ కాంగ్రెస్ నాయకులు ఉద్యమించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శెట్టి మనోహర్‌నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం కోదాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్ధుల ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం యువతను మోసం చేస్తుందన్నారు. సమావేశంలో వేణుగోపాల్, భుక్యారవినాయక్, మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకరాచారి, శివరాంయాదవ్, శ్రావణ్‌కుమార్, సైదులు, లిక్కి మోహన్‌రావు,సుంకరి అభిందర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.