ఆసిఫాబాద్: జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా పూర్తి ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.