
వెదుర్లబజార్‌లో అగ్నిప్రమాదం
రూ.4 లక్షల మేర నష్టం
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక వెదుర్లబజార్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. గూడూరు మనోజ్‌కుమార్ ఫ్యాన్సీ పొరకలు, ఇతర గృహోపకరణాల హోల్‌సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. దీపావళి పండుగ కావడంతో అతను రూ. లక్షలు విలువ చేసే సరుకును తెచ్చాడు. కింద నివాసం ఉండగా మొదటి, రెండో అంతస్తుల్లో దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉన్నట్టుండి రెండో అంతస్తు నుంచి పెద్ద ఎత్తున పొగ రావడంతో మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులు పరుగెత్తుకుంటూ బయటికి వచ్చారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పొరకలు, స్ప్రే బాటిళ్లు, ఇతర వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. రెండో అంతస్తులో ఉన్న ఏసీలో మంటలు వ్యాపించడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.4 లక్షలు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.