భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి | First Ekadashi with devotion | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

Published Wed, Jul 5 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం స్థానికులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం మహిళలు భక్తులు ఆలయాలను దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దవాగులో వేకువజామున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణవాడలోని పండరినాథ్, బాలేశ్వర, షిర్డీ సాయిబాబా, మార్కం డేయ స్వామి, శివకేశవ మందిరాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భజనలు నిర్వహించారు. ఉపవాసదీక్షలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా అర్చకుడు ఢిల్లీ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏకాదశి పదకొండు సంఖ్యలకు సంకేతమని, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు, వెరసి పదకొండింటిపైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నదే ఈ పండగ సందేశమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement