పంటలు మునిగి చెరువును తలపిస్తున్న ఈసోజీపేట శివారు
పుల్‌కల్: పుల్‌కల్ మండలం ఇసోజీపేట శివారులోని మంజీర పరీవాహక ప్రాతంలో సుమారు 250 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. శనివారం రాత్రి ఒక్కసారిగా సింగూర్ నుంచి 9 గేట్ల ద్వారా 1.20 లక్షల క్యూసెక్యూల నీటిని విడుదల చేశారు. దీంతో పంట పొలాలు, బోర్లు సైతం నీట మునిగాయి. గ్రామం చుట్టూ ఎక్కడ చూసినా మంజీర నీరే కనిపించింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నీటిని పరిశీలించారు.