జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదలవుతున్న వరద ప్రవాహం
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జూరాల రిజర్వాయర్‌కు శనివారం రెండులక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు క్రస్టుగేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 2,17,795 క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు.
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జూరాల రిజర్వాయర్‌కు శనివారం రెండులక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు క్రస్టుగేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 2,17,795 క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న వరద ప్రవాహం లోయర్ జూరాల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు వెళ్తోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.46 టీఎంసీల నీటినిల్వను నిర్వహిస్తూ పై నుంచి వస్తున్న వరదను 14 క్రస్టుగేట్లను తెరచి 1,79,470 క్యూసెక్కుల వరదను, విద్యుదుత్పత్తి ద్వారా 35వేల క్యూసెక్కుల వరద మొత్తం 2,17,795 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు.