
స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు
వరంగల్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు పాల్గొన్నారు.
డోర్నకల్: వరంగల్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు పాల్గొన్నారు. ఇంగ్లాండ్ దేశంలోని గ్లౌస్టర్ చర్చికి చెందిన పది మంది బృందం గత కొద్ది రోజులుగా డోర్నకల్ మండలంలో పర్యటిస్తున్నారు. చర్చి కాంపౌండ్‌లో డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో విదేశీయులు పాల్గొన్నారు.