ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీస్‌పై తేలని భవితవ్యం
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీస్‌పై తేలని భవితవ్యం
Published Sat, Sep 3 2016 12:23 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
హన్మకొండ అర్బన్ : ఫారెస్ట్ సెటిల్‌మెంట్ కార్యాలయం భవిష్యత్ ఇంకా తేలలేదు. ప్రస్తుతం కలెక్టరేట్‌లో రెండు గదుల్లో ఉన్న ఈ కార్యాలయంలో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి(ఎఫ్‌ఎస్‌ఓ)గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణవేణి ఉన్నారు. అటవీశాఖ నుంచి మరో అధికారి డిప్యూటీ రేంజ్ అధికారి హోదాలు పనిచేస్తున్నారు. అటెండర్, స్వీపర్‌గా ఔట్‌సోర్సింగ్ వారి సేవలు ఉపయోగించుకుంటున్నారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూసంబంధ వ్యవహారాలు సత్వర పరిష్కారం కోసం ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే కార్యాలయంలో రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో కొత్త జిల్లాలకు పంపిణీ వ్యవహారం ఏమిటనేది ఆంతుచిక్కడంలేదు. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాలకు కొత్త అధికారులను ఇచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ కార్యాలయ పరిధిని మూడు లేదా నాలుగు జిల్లాలకు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విభజన సమయంలో కొత్త జిల్లాల్లో ఈ కార్యాలయం భవితవ్యం ఏమిటనేది తేలాల్సి ఉంది.
Advertisement