పోరాడి.. గెలిచింది
అధికారుల చొరవతో సద్దుమణిగిన వివాదం
కాగా, కమిటీ వారు మల్లేష్‌నే అటెండర్‌గా నియమించారు. దీంతో సౌందర్య పాఠశాలకు చేరుకుని, తన భర్త గతంలో యేళ్ల తరబడి పాఠశాలలో స్వీపర్‌గా పనిచేశాడని.. న్యాయంగా ఆ పోస్టు తమకే రావాలని.. పైగా గడువు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తారని వాగ్వాదానికి దిగింది.ఉపాధ్యాయులు కల్పించుకుని ‘నువ్వు పనిచేయలేవ’ని చెప్పడంతో తన కూతురుకైనా ఆ పోస్టు ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్ పో సుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
దీంతో అక్కడున్న వారు ఆమెను అడ్డుకున్నారు. ఏకపక్షంగా ఎలా ఎంపిక చేస్తారంటూ కొందరు సౌందర్యకు మద్దతుగా కమిటీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సౌందర్యకు న్యా యం జరిగేలా చూస్తామని గ్రామపెద్దలు, ఎస్‌ఎంసీ కమిటి సభ్యులు తెలిపారు. అయినా ఆమె వారి మాట వినకుండా స్కూల్ ఎదుట బైఠాయించింది. అనంతరం ఎంఈఓ నర్సిం హరావు, సర్పంచ్ ఐతే సారయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్, గ్రామస్తుల సమక్షంలో సౌందర్యను ఎంపిక చేయడంతో వివాదం సద్దుమణిగింది.