టాక్సీ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
Published Mon, Aug 8 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ది సంస్థ(అబర్డ్) శ్రీకాకుళం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువకులకు టాక్సీ డ్రైవింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరక్టర్ బగాన శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ టాక్సీ డ్రైవింగ్ శిక్షణ ఈనెల 10వ తేదీ నుంచి 30 రోజులపాటు శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారై ఉండాలని, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలని, కనీస అర్హత 9వ తరగతి ఆపై చదివినవారు శిక్షణకు అర్హులని తెలిపారు. ఎల్‌ఎల్‌ఆర్ తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు 08942–222369, 9553410809 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకుని శిక్షణకు హాజరుకావాలని కోరారు.
Advertisement