నేటి నుంచి ‘పాలేరు’కు సాగర్ నీరు విడుదల
Published Wed, Aug 24 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్‌కు గురువారం నుంచి సాగర్‌నీటిని విడుదల చేయనున్నారు. మొదటి జోన్‌కు తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత సాగునీటి అవసరాలు తీర్చేందుకు గాను మొదటి జోన్ పరిధిలో ఉన్న రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. రోజుకు 2వేల క్యూసెక్కుల చొప్పున పదిరోజులపాటు 6.09టీఎంసీల నీటిని విడుదల చేస్తారు. అలాగే రిజర్వాయర్ పరిధిలోని సాగర్‌ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈషెడ్యూల్ ప్రకారం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని మొదటిజోన్ పరిధిలోని ఆయకట్టుకు 7విడతలుగా నీటిని విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటి వరకు కేవలం 6అడుగులే ఉన్న పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం, సాగర్‌నీటి విడుదలతో 23అడుగులకు చేరనుంది.
Advertisement