పారిశుద్ధ్య పనులకు నిధులు కేటాయించాలి
పారిశుద్ధ్య పనులకు నిధులు కేటాయించాలి
Published Sun, Aug 28 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
కొండకిందిగూడెం (కేతేపల్లి) : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. విషజ్వరాల బారిన పడిన కొండకిందిగూడెం గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించి బాధితులను పరామర్శించారు. గ్రామంలో విషజ్వరాలు ప్రబలటానికి గల కారణాలను స్థానికులు, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరం నిర్వహిస్తున్న పాఠశాలలో సరైన వసతులు, పరిశుభ్రత లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుతో మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం ఇస్తున్నట్లు నిధులు పంచాయతీలకు సరిపోవటం లేదన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై గ్రామీణ ప్రజలకు అవగాన కల్పించాలని కోరారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ డి.సాయిరెడ్డి, నకిరేకల్ సర్పంచ్ పన్నాల రంగమ్మరాఘవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోట పుల్లయ్య, నాయకులు మారం చెన్నకృష్ణారెడ్డి, జటంగి వెంకటనర్సయ్యయాదవ్, మారం వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు.
Advertisement