గౌడఫెడరేషన్ కు నిధులు
Published Tue, Dec 27 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో గౌడ కులస్థుల కోసం ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రూపొందించిన 2017 క్యాలెండర్‌ను కేఈ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే గౌడ ఫెడరేషన్‌కు నిధులు కేటాయిస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, సంఘం ప్రధాన కార్యదర్శి యం నాగశేషన్నగౌడ్, ఎన్‌జీఓస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఐ శ్రీరాములు, నాయకులు కేఈ వేమన్న, కాసాని వెంకటేశ్వర్లు, ఈ శ్రీనివాసులుగౌడ్, మహేష్‌గౌడ్, శేషాద్రిగౌడ్, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement