deputycm
-
నగదు రహిత గ్రామంగా మేడపాడు
డిప్యూటీ సీఎం, ఎస్బీహెచ్ డీజీఎం ప్రకటన ఎస్బీహెచ్ నూతన భవనం ప్రారంభం జి. మేడపాడు (సామర్లకోట) : రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జి. మేడపాడు గ్రామంలో ఎస్బీహెచ్ సహకారంతో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామని, ఈ మేరకు నగదు రహిత గ్రామంగా డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజరు శిబి చండీ ప్రకటించారు. శనివారం మండల పరిధిలో జి.మేడపాడు గ్రామంలోని ఎస్బీహెచ్ బ్రాంచి నూతన భవనం ప్రారంభం సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజప్ప జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఇప్పటికే ఈ గ్రామం రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా ఎంపికైందని, గ్రామం పూర్తిగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంకు అధికారులు సహకరించాలన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వ పరంగా అందజేస్తామన్నారు. డీజీఎం చండి మాట్లాడుతూ గ్రామంలో 2014లో బ్రాంచిని ఏర్పాటు చేశామని, రూ.2,56,000 కోట్ల వ్యాపారం చేస్తున్నదన్నారు. రూ.1,45,400 కోట్ల డిపాజిట్లు, రూ.1,10,600 కోట్లు రుణాలుగా ఉన్నాయన్నారు. విశాఖ జో¯ŒS పరిధిలో డిసెంబరు వరకు 5,800 కోట్లు డిపాజిట్లుగాను, రూ.3,400 కోట్లు రుణాలతోను వ్యాపారం జరుగుతోందన్నారు. రాజమండ్రి రిజియ¯ŒS పరిధిలో రూ.1,615 కోట్లు డిపాజిట్లు, రూ.1,385 కోట్ల రుణాలతో బ్యాంకు అభివృద్ధి రంగంలో వ్యాపారం సాగుతోందన్నారు. సీనియర్ సిటిజన్లకు, రైతులకు, మహిళా రుణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. గ్రామస్తుల చైతన్యంతో తమ బ్యాంకు గ్రామాన్ని దతత్త తీసుకొని పూర్తిగా నగదు రహిత గ్రామంగా గుర్తింపు పొందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ నగదు రహిత లావాదేవిలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. మేడపాడులో నగదు రహిత లావాదేవీలకు పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నామన్నారు. గ్రామంలోని కిరాణా షాపు యజమానికి, సొసైటీకి బ్యాంకుకు చెందిన స్వైపింగ్ మిషన్లను ముఖ్య అతిథులు అందజేశారు. బ్యాంకు ఏజీఎం ఎ¯Œ ఎస్ ప్రసాద్, బ్రాంచి మేనేజరు కె.డి.రామకృష్ణారావు, విశాఖ బ్రాంచి మేనేజరు శివరామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మీ, సర్పంచ్ బేదంపూడి సూర్యకుమారి, సొసైటీ అధ్యక్షుడు పాలకుర్తి భవన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గౌడఫెడరేషన్ కు నిధులు
– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో గౌడ కులస్థుల కోసం ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రూపొందించిన 2017 క్యాలెండర్‌ను కేఈ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే గౌడ ఫెడరేషన్‌కు నిధులు కేటాయిస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, సంఘం ప్రధాన కార్యదర్శి యం నాగశేషన్నగౌడ్, ఎన్జీఓస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఐ శ్రీరాములు, నాయకులు కేఈ వేమన్న, కాసాని వెంకటేశ్వర్లు, ఈ శ్రీనివాసులుగౌడ్, మహేష్‌గౌడ్, శేషాద్రిగౌడ్, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఆధునిక వైద్యంతోనే వ్యాధుల అదుపు
ప్రైవేటు వైద్యుల్లోనూ సేవాభావం అవసరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజప్ప అమలాపురంలో ముగిసిన ఐఎంఏ ఏపీ కా¯ŒS–2016 అమలాపురం రూరల్ : ఆధునిక వైద్యంతో వ్యాధులను అదుపు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యులు వారి సేవలను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. స్థానిక కిమ్స్ వైద్య కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఐఎంఏ ఏపీ కా¯ŒS–2016 ముగింపు సభ ఆదివారం రాత్రి జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజప్ప మాట్లాడుతూధులు త్వరగా నయం చేసే వైద్య సదుపాయాలు మరింత అందుబాటులోకి రావాలని ఆక్షాంక్షించారు. ప్రైవేటు వైద్యుల్లోనూ కొంత సేవా తత్పరత ఉండాలన్నారు. చైతన్య విద్యా సంస్థల అధినేత కె.సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాజప్పను రాష్ట్ర ఐఎంఏ నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించింది. రాష్ట్ర ఐఎంఏ నూతన అధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు, కోనసీమ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గంధం రామం, కార్యదర్శి డాక్టర్ పి.సురేష్‌బాబు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, కిమ్స్ డీ¯ŒS డాక్టర్ ఎ.కామేశ్వరరావు, డాక్టర్ నిమ్మకాయల రామమూర్తి, డాక్టర్ కొమ్ముల ధ్వనంతరినాయుడు, డాక్టర్ విఎస్ఎస్ఎ¯ŒS మూర్తి, డాక్టర్ గొల్లకోటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. హెపటైటీస్–బీ, సీపై చర్చ సదస్సులో హెపటైటిస్–బీ, సీలపై విస్తృత చర్చ జరిగింది. ఈ వ్యాధి కోనసీమలో ఎక్కువగా ఉందని విశాఖకు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పెద వీర్రాజు అన్నారు. కోనసీమ వైద్యులు ఈ అంశంపై అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. వైద్యులకు కోనసీమ రుచులు సదస్సుకు హాజరైన వైద్యులకు అతిథి మర్యాదల్లో భాగంగా ఆత్రేయపురం పూతరేకులు, అమలాపురం బొబ్బట్లు, కండ్రిగ పాలకోవాలు, కోనసీమ మామిడి తాండ్ర తదితరాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే కోనసీమ ప్రకృతి అందాలు తిలకించేందుకు, పుణ్య క్షేత్రాలను వారు సందర్శించారు. ఎంఎల్సీలపై అవగాహన సదస్సులో అమలాపురం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది ఎండీ ఆజం మెడికో లీగల్ కేసుల విషయంలో వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విశాఖకు చెందిన ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. నిబంధనలు సడలిస్తే మరిన్ని సేవలు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ఆస్పత్రుల ద్వారా ఇకపై మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఇండియ¯ŒS మెడికల్ అసోసియేష¯ŒS (ఐఎంఏ) రాష్ట్ర నూతన కార్యవర్గం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పొట్లూరి గంగాధరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు తన కార్యవర్గ ప్రతినిధులతో కలిసి స్థానిక విలేకర్లతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం ప్రైవేటు చిన్న ఆస్పత్రుల ద్వారానే ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం కూడా నిబంధనలు సడలించి అనుమతులు ఇస్తే మరింత మెరుగైన సేవలు అందించేందుకు తమ ఐఎంఏ వైద్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరిగితే ఆర్టికల్ 11, 2008 చట్టం ప్రకారం శిక్షించే అవకాశం ఉందని, ఈ చట్టాన్ని దివంగత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకుని వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఐఎంఏ నూతన కార్యవర్గం ఇదే రాష్ట్ర ఐఎంఏ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా డాక్టర్ గంగాధరరావు (గుడివాడ), కార్యదర్శిగా డాక్టర్ కొల్లి శ్రీకరుణమూర్తి (విజయవాడ), కోశాధికారిగా డాక్టర్ అనిల్‌కుమార్ (విజయవాడ), ఉపాధ్యక్షులుగా డాక్టర్ విజయశేఖర్ (విశాఖ), డాక్టర్ వెంకటేశ్వర్లు (తిరుపతి), డాక్టర్ నందకిషోర్ (గుడివాడ), సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ పయ్యావుల సురేష్‌బాబు (అమలాపురం), డాక్టర్ మద్దూరి రవికృష్ణ (నంద్యాల), సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.