- ప్రైవేటు వైద్యుల్లోనూ సేవాభావం అవసరం
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజప్ప
- అమలాపురంలో ముగిసిన ఐఎంఏ ఏపీ కా¯ŒS–2016
ఆధునిక వైద్యంతోనే వ్యాధుల అదుపు
Published Sun, Nov 20 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
అమలాపురం రూరల్ :
ఆధునిక వైద్యంతో వ్యాధులను అదుపు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యులు వారి సేవలను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. స్థానిక కిమ్స్ వైద్య కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఐఎంఏ ఏపీ కా¯ŒS–2016 ముగింపు సభ ఆదివారం రాత్రి జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజప్ప మాట్లాడుతూధులు త్వరగా నయం చేసే వైద్య సదుపాయాలు మరింత అందుబాటులోకి రావాలని ఆక్షాంక్షించారు. ప్రైవేటు వైద్యుల్లోనూ కొంత సేవా తత్పరత ఉండాలన్నారు. చైతన్య విద్యా సంస్థల అధినేత కె.సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాజప్పను రాష్ట్ర ఐఎంఏ నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించింది. రాష్ట్ర ఐఎంఏ నూతన అధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు, కోనసీమ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గంధం రామం, కార్యదర్శి డాక్టర్ పి.సురేష్‌బాబు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, కిమ్స్ డీ¯ŒS డాక్టర్ ఎ.కామేశ్వరరావు, డాక్టర్ నిమ్మకాయల రామమూర్తి, డాక్టర్ కొమ్ముల ధ్వనంతరినాయుడు, డాక్టర్ విఎస్‌ఎస్‌ఎ¯ŒS మూర్తి, డాక్టర్ గొల్లకోటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.
హెపటైటీస్–బీ, సీపై చర్చ
సదస్సులో హెపటైటిస్–బీ, సీలపై విస్తృత చర్చ జరిగింది. ఈ వ్యాధి కోనసీమలో ఎక్కువగా ఉందని విశాఖకు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పెద వీర్రాజు అన్నారు. కోనసీమ వైద్యులు ఈ అంశంపై అధ్యయనం చేయాలని ఆయన అన్నారు.
వైద్యులకు కోనసీమ రుచులు
సదస్సుకు హాజరైన వైద్యులకు అతిథి మర్యాదల్లో భాగంగా ఆత్రేయపురం పూతరేకులు, అమలాపురం బొబ్బట్లు, కండ్రిగ పాలకోవాలు, కోనసీమ మామిడి తాండ్ర తదితరాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే కోనసీమ ప్రకృతి అందాలు తిలకించేందుకు, పుణ్య క్షేత్రాలను వారు సందర్శించారు.
ఎంఎల్‌సీలపై అవగాహన
సదస్సులో అమలాపురం పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది ఎండీ ఆజం మెడికో లీగల్ కేసుల విషయంలో వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విశాఖకు చెందిన ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.
నిబంధనలు సడలిస్తే మరిన్ని సేవలు
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ఆస్పత్రుల ద్వారా ఇకపై మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఇండియ¯ŒS మెడికల్ అసోసియేష¯ŒS (ఐఎంఏ) రాష్ట్ర నూతన కార్యవర్గం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పొట్లూరి గంగాధరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు తన కార్యవర్గ ప్రతినిధులతో కలిసి స్థానిక విలేకర్లతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం ప్రైవేటు చిన్న ఆస్పత్రుల ద్వారానే ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం కూడా నిబంధనలు సడలించి అనుమతులు ఇస్తే మరింత మెరుగైన సేవలు అందించేందుకు తమ ఐఎంఏ వైద్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరిగితే ఆర్టికల్ 11, 2008 చట్టం ప్రకారం శిక్షించే అవకాశం ఉందని, ఈ చట్టాన్ని దివంగత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకుని వచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ఐఎంఏ నూతన కార్యవర్గం ఇదే
రాష్ట్ర ఐఎంఏ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా డాక్టర్ గంగాధరరావు (గుడివాడ), కార్యదర్శిగా డాక్టర్ కొల్లి శ్రీకరుణమూర్తి (విజయవాడ), కోశాధికారిగా డాక్టర్ అనిల్‌కుమార్ (విజయవాడ), ఉపాధ్యక్షులుగా డాక్టర్ విజయశేఖర్ (విశాఖ), డాక్టర్ వెంకటేశ్వర్లు (తిరుపతి), డాక్టర్ నందకిషోర్ (గుడివాడ), సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ పయ్యావుల సురేష్‌బాబు (అమలాపురం), డాక్టర్ మద్దూరి రవికృష్ణ (నంద్యాల), సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Advertisement
Advertisement