నగదు రహిత గ్రామంగా మేడపాడు | money less village medapadu | Sakshi
Sakshi News home page

నగదు రహిత గ్రామంగా మేడపాడు

Published Sat, Jan 7 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

money less village medapadu

  • డిప్యూటీ సీఎం, ఎస్‌బీహెచ్‌ డీజీఎం ప్రకటన
  • ఎస్‌బీహెచ్‌ నూతన భవనం ప్రారంభం
  • జి. మేడపాడు (సామర్లకోట) : 
    రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జి. మేడపాడు గ్రామంలో ఎస్‌బీహెచ్‌ సహకారంతో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామని, ఈ మేరకు నగదు రహిత గ్రామంగా డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, బ్యాంకు డిప్యూటీ జనరల్‌ మేనేజరు శిబి చండీ ప్రకటించారు. శనివారం మండల పరిధిలో జి.మేడపాడు గ్రామంలోని ఎస్‌బీహెచ్‌ బ్రాంచి నూతన భవనం ప్రారంభం సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజప్ప జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఇప్పటికే ఈ గ్రామం రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా ఎంపికైందని, గ్రామం పూర్తిగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంకు అధికారులు సహకరించాలన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వ పరంగా అందజేస్తామన్నారు. డీజీఎం చండి మాట్లాడుతూ గ్రామంలో 2014లో బ్రాంచిని ఏర్పాటు చేశామని, రూ.2,56,000 కోట్ల వ్యాపారం చేస్తున్నదన్నారు. రూ.1,45,400 కోట్ల డిపాజిట్లు, రూ.1,10,600 కోట్లు రుణాలుగా ఉన్నాయన్నారు. విశాఖ జో¯ŒS పరిధిలో డిసెంబరు వరకు 5,800 కోట్లు డిపాజిట్లుగాను, రూ.3,400 కోట్లు రుణాలతోను వ్యాపారం జరుగుతోందన్నారు. రాజమండ్రి రిజియ¯ŒS పరిధిలో రూ.1,615 కోట్లు డిపాజిట్లు, రూ.1,385 కోట్ల రుణాలతో బ్యాంకు అభివృద్ధి రంగంలో వ్యాపారం సాగుతోందన్నారు. సీనియర్‌ సిటిజన్లకు, రైతులకు, మహిళా రుణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. గ్రామస్తుల చైతన్యంతో తమ బ్యాంకు గ్రామాన్ని దతత్త తీసుకొని పూర్తిగా నగదు రహిత గ్రామంగా గుర్తింపు పొందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ నగదు రహిత లావాదేవిలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. మేడపాడులో నగదు రహిత లావాదేవీలకు పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నామన్నారు. గ్రామంలోని కిరాణా షాపు యజమానికి, సొసైటీకి బ్యాంకుకు చెందిన స్వైపింగ్‌ మిషన్లను ముఖ్య అతిథులు అందజేశారు. బ్యాంకు ఏజీఎం ఎ¯Œ ఎస్‌ ప్రసాద్, బ్రాంచి మేనేజరు కె.డి.రామకృష్ణారావు, విశాఖ బ్రాంచి మేనేజరు శివరామకృష్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మ¯ŒS పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మీ, సర్పంచ్‌ బేదంపూడి సూర్యకుమారి, సొసైటీ అధ్యక్షుడు పాలకుర్తి భవన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement