వైభవంగా దొణగంగమ్మ జాతర
రాయదుర్గం మండలం టీ.వీరాపురం సమీపంలో
శ్రావణమాస చివరి సోమవారం దొణగంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ విగ్రహాన్ని రంగు రంగుల పుషా్షలతో అలంకరించిన రథంలో కొలువుదీర్చి ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష భక్తులు దొణ నీటిలో స్నానమాచరించారు అనంతరం కోర్కెలు తీర్చాలని దొణచుట్టూ ప్రదక్షణలు చేశారు. అమ్మవారికి పూజలు చేసి, నైవేద్యం సమర్పించి వెంట తెచ్చుకున్న తీపి వంటలను అక్కడే ఆరగించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, ఎంపీపీ హŸన్నే భారతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, ఐనాపురం మంజునాథ, ధనుంజయరెడ్డి, కొంతానపల్లి ఆంజనేయులు, పవన్, ఉమేష్ పాల్గొన్నారు.