కడప: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం కడపలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షలుంటే వ్యక్తిగతంగానే చూసుకోవాలని పురందేశ్వరికి గంటా హితవు పలికారు. అంతేకాని.. తమ సీఎం చంద్రబాబును... ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించవద్దని పురందేశ్వరికి ఈ సందర్భంగా హెచ్చరించారు. మొన్నటి బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి తక్కవ నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. చేతనైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలని పురందేశ్వరికి గంటా సూచించారు.