
గరుడవాహనంపై రంగనాథుడు
పులివెందుల టౌన్ :
పట్టణంలోని అతి ప్రాచీనమైన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం శ్రీరంగనాథుడు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదారులచే ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ స్వామివారికి పూజలు జరిపించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. నేడు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.