‘గీతం’ స్వచ్ఛభారత్
‘గీతం’ స్వచ్ఛభారత్
Published Sun, Aug 21 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
సాగర్‌నగర్ ః స్థానిక కైలాసగిరి సమీపంలోని తెన్నేటిపార్కులో గీతం విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్), గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగం వలంటీర్ల ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 50మంది విద్యార్థినీ, విద్యార్థులు తెల్లవారుజామున నుంచి కార్యక్రమంలో పాల్గొని తెన్నేటిపార్కు పరిరాలను శుభ్రం చేశారు. పార్కులో వ్యర్థాలను తెలగించి మొక్కలకు నీరు అందే విధంగా పాదులు సరిచేయడంతోపాటు సందర్శకులకు పరిశుభ్రత పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. లక్ష్మీప్రసాద్, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.స్వామి, విద్యార్థి వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ కె. వీరభద్రం, డైరెక్టర్ ఎన్‌ఎస్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement