geetam
-
మెరుపు.. మైమరపు
ఉత్తుంగ తరంగంగా ఒడిశా బాలల నాట్యం గోఠిపువా నాట్యం ఉత్కంఠభరితం ప్రాచీన కళారూపం.. నయన మనోహరం విశాఖ–కల్చరల్ : మేఘాలు గజ్జెలు కట్టి ఘల్లుమని నాట్యం చేసినట్టు.. మెరుపు తీగలు ఇలకు దిగివచ్చి ఆడిపాడి అలరించినట్టు.. ఒడిశా చిన్నారులు చేసిన నాట్యం నయనమనోహరమై, హదయ సమ్మోహనమై సాగింది. ఒడిశా సంప్రదాయ కళావైభవ ప్రదర్శనతో ఊహాలోకం కళ్లెదుట ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఒడిశా సంప్రదాయ నాట్యమైన గోఠిపువా ప్రదర్శనతో గీతం విశ్వవిద్యాలయ వేదిక ఉప్పొంగిపోయింది. శనివారం పట్టభద్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు రమణీయ ఆహార్యంతో, అంతకుమించిన హావభావ ప్రదర్శనతో గీతం ఆనంద డోలికల్లో తేలిపోయింది. భారతీయ యువతకు మన సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని తెలియజెప్పే ధ్యేయంతో స్పిక్‌మెకే సంస్థ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ప్రసిద్ధ క్షేత్రమైన పూరీకి చేరువలోని రఘురాజ్‌పూర్ నుంచి వచ్చిన బాలలు కనువిందైన వేషధారణలో కళ్లు చెదిరేలా నత్య ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకష్ణుని జీవితాన్ని ప్రతిబింబిస్తూ యోగా భంగిమలను తలపించుతూ నాట్యం చేశారు. గ్రామీణ వాయిద్యాలతో మనోహర సంగీతాన్ని వినిపిస్తూ నేత్రపర్వంగా గంటసేపు నాట్యమాడారు. ఈ సందర్భంగా స్పిక్‌మేకే సంస్థ ప్రతినిధి టి.గంగాదేవి మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ ఈకళాకారులకు కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నట్టు తెలిపారు. మన ప్రాచీన కళలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.షీలా చెప్పారు. -
మెకానికల్ ఇంజనీర్లకు విస్తృత ఉద్యోగవకాశాలు
సాగర్‌నగర్ ః మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులు మెటీరియల్ సైన్స్, వెల్డింగ్ టెక్నాలజీ, కోడ్ స్టాండర్డ్‌లపై లోతైన అవగాహన కలిగి ఉండాలని అలాంటి వారికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఉద్యోగవకాశాలు లభిస్తాయని కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ప్రాజెక్టు ఇంజనీర్ జి.వి.రమేష్ పేర్కొన్నారు. గీతం విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో దాదాపు 400 మంది విద్యార్థులు సభ్యులుగా ఏర్పాటైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా)విద్యార్థి విభాగాన్ని ఆయన మఖ్యఅతిథిగా çహాజరై గురువారం ప్రారంబించారు. ఇంజినీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థులు ప్రాథమిక సూత్రాలను (ఫండమెంటల్స్)మరువకూడదని సూచించారు. నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్న ప్రాథమిక సూత్రాలపై బలమైన పట్టు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి అణుశక్తిరంగంలోకి ప్రవేశించిన తనకు వివిధ ఇంజనీరింగ్ అంశాలపై ఏ విధంగా అవగాహనæ పెంచుకోవలసిన అవసరం వచ్చిందో ఆయన వివరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యసించటం అంటే మెటీరియల్ సైన్స్‌ను అర్థ్ధం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. దేశ అణువిద్యుత్ ఉత్సాదక రంగంలో అమెరికా సహాయంతో ఏర్పాటవుతున్న కొవ్వాడ, అణువిద్యత్ కేంద్రంపై ఇటీవలే పర్యావరణ నివేదికను కేంద్రప్రభుత్వపర్యావరణ, అటవీమంత్రిత్వశాఖకు అందజేయశామని ఆయన తెలిపారు. అణువిద్యుత్ కేంద్రంలో అమర్చే భారీ టర్బైన్లను విశాఖ ఓడరేవు నుంచి విద్యుత్ కేంద్రం వరకు తరలించే ప్రయత్నాన్ని ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని విద్యార్థులు పరిశీలన దష్టితో కోర్సును అభ్యసించాలని సూచించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజ నాత్మకతను వెలికి తీయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ వంటి విద్యార్థి విభాగాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎం.ఆర్.ఎస్.సత్యనారాయణ, ఫ్యాకల్టీ సలహాదారుడు ఆర్. భానుపవన్, పి.అఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
‘గీతం’ స్వచ్ఛభారత్
సాగర్‌నగర్ ః స్థానిక కైలాసగిరి సమీపంలోని తెన్నేటిపార్కులో గీతం విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్), గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగం వలంటీర్ల ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 50మంది విద్యార్థినీ, విద్యార్థులు తెల్లవారుజామున నుంచి కార్యక్రమంలో పాల్గొని తెన్నేటిపార్కు పరిరాలను శుభ్రం చేశారు. పార్కులో వ్యర్థాలను తెలగించి మొక్కలకు నీరు అందే విధంగా పాదులు సరిచేయడంతోపాటు సందర్శకులకు పరిశుభ్రత పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. లక్ష్మీప్రసాద్, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.స్వామి, విద్యార్థి వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ కె. వీరభద్రం, డైరెక్టర్ ఎన్ఎస్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహం నింపిన ‘గీతం’ వేడుక
భారతరత్న ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావుకు ‘గీతం’ ఫౌండేషన్ అవార్డు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్తేజ పరిచిన ప్రముఖుల ప్రసంగాలు సాగర్‌నగర్ : విద్యారంగంలో జాతీయస్థాయి కీర్తి ప్రతిష్టలను ఇనుమండింపజేస్తున్న గీతం విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ,జాతీయస్థాయి ప్రముఖుల ప్రసంగాలతో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు ఆడిటోరియంలో జరిగిన ఉత్సవంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, అధ్యాపకులు తరలివచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత రసాయనశాస్త్ర పరిశోధకుడు, భారతరత్న ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావు(ఫ్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు)కు గీతం అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి గీతం ఫౌండేషన్ అవార్డుతోపాటు 10 లక్షల రూపాయల అవార్డు మొత్తాన్ని అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ సీ.ఎన్.ఆర్.రావు విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం దేశంలో శాస్త్ర విజ్ఞానానికి గల ప్రాధాన్యతను ఆలోచింప చేసింది. గీతం అధ్యక్షుడు డాక్టర్ మూర్తి మాట్లాడుతూ బోధన, పరిశోధన ద్వారా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారతరత్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావును గీతం ఫౌండేషన్ అవార్డుతో సత్కరించడం గీతంకు లభించిన గౌరవంగా అభిప్రాయపడ్డారు. గీతం చాన్స్‌లర్ పొఫెసర్ కె. రామకష్ణారావు మాట్లాడుతూ యువతరం స్వదేశీ భావనను అర్థం చేసుకుని అనుసరించాలని సూచించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ 36ఏళ్ల గీతం విశ్వవిద్యాలయం తన ప్రతిభను జాతీయ, రాష్ట్రస్థాయిలో అరుదైన విశిష్ట ముద్రను ఉన్నత విద్యారంగంపై నిలిపిందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు గీతంలో 16 పేటెంట్లు నమోదు అయ్యాయని మరో 40 పరిశోధనల ఫలితాలపై పేటెంట్లకు రిజిస్టర్‡ చేశామని వెల్లడించారు. ఈ ఏడాది వివిధ అధ్యాయనాలకు గాను 11 పరిశోధనా కేంద్రాలను గీతం వర్శిటీలోని మూడు ప్రాంగణాల్లోను నెలకొల్పొతున్నట్టు ప్రకటించారు. ప్రతిభకు పట్టం గీతం విశ్వవిద్యాలయం ఉత్తమ టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ప్రతిభకు ఉత్తమ అవార్డులు అందజేశారు. పరీక్షా విభాగంలో సేవలు అందిస్తున్న ఎం. బాలసుబ్రహ్మణ్యం, విశ్వవిద్యాలయంలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వి.శంకరరావులకు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన బెస్ట్ స్పీకర్ అవార్డు పోటీల్లో విజేతలుగా నిలిచిన న్యాయ కళాశాల విద్యార్థిని జి.సాయి, కార్తిక్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రియా గుహ,హైదరాబాద్ బిజినెస్ స్కూల్ విద్యార్థిని ఎస్.సందతి బహుమతులు అందుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక సంబరాలు వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల కష్ణాష్కరాలలో ప్రత్యేక శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్న గీతం విద్యార్థిని పి.వి.ఎన్.ఎల్.శ్రావణి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, గీతం ఉపా«ధ్యక్షుడు ప్రొఫెసర్ కె. గంగాధరరావు, ప్రోవైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. శివరామకష్ణ, ప్రొఫెసర్లు ఎన్. శివప్రసాద్, పి.వి.శివపుల్లయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు, గీతం కార్యదర్శి బి.వి.మోహన్‌రావు, కోశాధికారి బి.ఎస్.ఎన్.రాజు, వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.