మెకానికల్ ఇంజనీర్లకు విస్తృత ఉద్యోగవకాశాలు
మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులు మెటీరియల్ సైన్స్, వెల్డింగ్ టెక్నాలజీ, కోడ్ స్టాండర్డ్‌లపై లోతైన అవగాహన కలిగి ఉండాలని అలాంటి వారికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఉద్యోగవకాశాలు లభిస్తాయని కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ప్రాజెక్టు ఇంజనీర్ జి.వి.రమేష్ పేర్కొన్నారు.
సాగర్‌నగర్ ః మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులు మెటీరియల్ సైన్స్, వెల్డింగ్ టెక్నాలజీ, కోడ్ స్టాండర్డ్‌లపై లోతైన అవగాహన కలిగి ఉండాలని అలాంటి వారికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఉద్యోగవకాశాలు లభిస్తాయని కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ప్రాజెక్టు ఇంజనీర్ జి.వి.రమేష్ పేర్కొన్నారు. గీతం విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో దాదాపు 400 మంది విద్యార్థులు సభ్యులుగా ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా)విద్యార్థి విభాగాన్ని ఆయన మఖ్యఅతిథిగా çహాజరై గురువారం ప్రారంబించారు. ఇంజినీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థులు ప్రాథమిక సూత్రాలను (ఫండమెంటల్స్)మరువకూడదని సూచించారు. నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్న ప్రాథమిక సూత్రాలపై బలమైన పట్టు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి అణుశక్తిరంగంలోకి ప్రవేశించిన తనకు వివిధ ఇంజనీరింగ్ అంశాలపై ఏ విధంగా అవగాహనæ పెంచుకోవలసిన అవసరం వచ్చిందో ఆయన వివరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యసించటం అంటే మెటీరియల్ సైన్స్‌ను అర్థ్ధం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. దేశ అణువిద్యుత్ ఉత్సాదక రంగంలో అమెరికా సహాయంతో ఏర్పాటవుతున్న కొవ్వాడ, అణువిద్యత్ కేంద్రంపై ఇటీవలే పర్యావరణ నివేదికను కేంద్రప్రభుత్వపర్యావరణ, అటవీమంత్రిత్వశాఖకు అందజేయశామని ఆయన తెలిపారు. అణువిద్యుత్ కేంద్రంలో అమర్చే భారీ టర్బైన్‌లను విశాఖ ఓడరేవు నుంచి విద్యుత్ కేంద్రం వరకు తరలించే ప్రయత్నాన్ని ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని విద్యార్థులు పరిశీలన దష్టితో కోర్సును అభ్యసించాలని సూచించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజ నాత్మకతను వెలికి తీయడానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ వంటి విద్యార్థి విభాగాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎం.ఆర్.ఎస్.సత్యనారాయణ, ఫ్యాకల్టీ సలహాదారుడు ఆర్. భానుపవన్, పి.అఖిల్ తదితరులు పాల్గొన్నారు.