Mechanical engineers
-
మెకానికల్ ఇంజినీర్లు పనికిరారు : సీఎం
అగర్తలా : మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తరుచూ అలాంటి కామెంట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ వివాదాలకు దూరంగా ఉండాలని ఆదేశించినా.. బిప్లబ్ అవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా సివిల్ సర్వీసెస్ పై కామెంట్లు చేసి విమర్శలపాలయ్యారు. సివిల్, మెకానికల్ ఇంజినీర్లను పొల్చుతూ బిప్లబ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. శుక్రవారం అగర్తలాలో జరిగిన సివిల్ సర్వీస్ డేలో ఆయన మాట్లాడుతూ.. సివిల్స్‌కు సివిల్ ఇంజనీర్లు మాత్రమే సరిపోతారని, మెకానికల్ ఇంజినీర్లు అందుకు పనికిరారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకునే అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్లు అయితేనే సమాజాన్ని చక్కగా నిర్మించగలరని తెలిపారు. ఒకప్పుడు హ్యూమానిటీస్ చదివిన వారు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారని.. కాలం మారుతున్నందున ప్రస్తుతం డాక్టర్లు కూడా సివిల్స్ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణించగలరని పేర్కొన్నారు. రోగాన్ని నయం చేసే తెలివితేటలు కలిగిన వారు సమాజంలోని సమస్యలను అలాగే పరిష్కరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బిప్లబ్ ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు రెండు రోజుల ముందే నటి డయానా హెడెన్ కు మిస్ వరల్డ్ కిరీటం ఎలా ఇచ్చారంటూ కామెంట్ చేసిన బిప్లబ్‌పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన బిప్లబ్ స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. -
మెకానికల్ ఇంజనీర్లకు విస్తృత ఉద్యోగవకాశాలు
సాగర్‌నగర్ ః మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులు మెటీరియల్ సైన్స్, వెల్డింగ్ టెక్నాలజీ, కోడ్ స్టాండర్డ్‌లపై లోతైన అవగాహన కలిగి ఉండాలని అలాంటి వారికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఉద్యోగవకాశాలు లభిస్తాయని కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ప్రాజెక్టు ఇంజనీర్ జి.వి.రమేష్ పేర్కొన్నారు. గీతం విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో దాదాపు 400 మంది విద్యార్థులు సభ్యులుగా ఏర్పాటైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా)విద్యార్థి విభాగాన్ని ఆయన మఖ్యఅతిథిగా çహాజరై గురువారం ప్రారంబించారు. ఇంజినీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థులు ప్రాథమిక సూత్రాలను (ఫండమెంటల్స్)మరువకూడదని సూచించారు. నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్న ప్రాథమిక సూత్రాలపై బలమైన పట్టు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి అణుశక్తిరంగంలోకి ప్రవేశించిన తనకు వివిధ ఇంజనీరింగ్ అంశాలపై ఏ విధంగా అవగాహనæ పెంచుకోవలసిన అవసరం వచ్చిందో ఆయన వివరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యసించటం అంటే మెటీరియల్ సైన్స్‌ను అర్థ్ధం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. దేశ అణువిద్యుత్ ఉత్సాదక రంగంలో అమెరికా సహాయంతో ఏర్పాటవుతున్న కొవ్వాడ, అణువిద్యత్ కేంద్రంపై ఇటీవలే పర్యావరణ నివేదికను కేంద్రప్రభుత్వపర్యావరణ, అటవీమంత్రిత్వశాఖకు అందజేయశామని ఆయన తెలిపారు. అణువిద్యుత్ కేంద్రంలో అమర్చే భారీ టర్బైన్లను విశాఖ ఓడరేవు నుంచి విద్యుత్ కేంద్రం వరకు తరలించే ప్రయత్నాన్ని ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని విద్యార్థులు పరిశీలన దష్టితో కోర్సును అభ్యసించాలని సూచించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజ నాత్మకతను వెలికి తీయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ వంటి విద్యార్థి విభాగాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎం.ఆర్.ఎస్.సత్యనారాయణ, ఫ్యాకల్టీ సలహాదారుడు ఆర్. భానుపవన్, పి.అఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
మెకానికల్.. మెరిసే..!!
ఇంజనీరింగ్ స్పెషల్ నిత్యం ఉపయోగించే వాషింగ్ మెషిన్, గడియారాలు, సంగీత పరికరాలు, గన్స్, సైకిల్ మొదలైనవన్నీ మెకానికల్ ఇంజనీర్ల సృష్టే! మార్కెట్ ఒడిదొడుకులతో పెద్దగా ప్రభావితం కాకుండా స్థిరమైన అవకాశాలు అందించే బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఔత్సాహికుల కోసం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, కెరీర్ స్కోప్ వివరాలు.. కోర్సు ఇలా జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ అర్హత పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ప్రఖ్యాత ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. వీటితో పాటు ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సీటు దక్కించుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారా రాష్ట్రంలోని క్యాంపస్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లో సీటు లభిస్తుంది. థర్మో డైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, థర్మల్ ఇంజనీరింగ్ తదితర కోర్ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఏరోస్పేస్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీర్, ఆటోమోటివ్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, న్యూక్లియర్ ఇంజనీర్, టూల్ డిజైనర్.. మొదలైన వాటిలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్‌లోని పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, వీఎస్ఎస్సీ, ఇస్రో, ఐవోసీ, డీఆర్డీవో, సెయిల్, ఎన్టీపీసీ, డిఫెన్స్, పీడబ్ల్యుడీ, సీపీడబ్ల్యుడీ, ఆర్మ్డ్ ఫోర్సెస్‌ల్లో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ఉన్నత విద్య మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు గేట్, పీజీఈసెట్ ద్వారా ఎంటెక్‌లో చేరొచ్చు. హైడ్రాలిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్, మ్యానుఫాక్చరింగ్ ఇంజనీరింగ్, ఏరో డైనమిక్స్ తదితర స్పెషలైజేన్లలో ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. అలాగే మేనేజ్మెంట్ విద్య పట్ల ఆసక్తి ఉంటే... క్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి పరీక్షల్లో ప్రతిభను చూపడం ద్వారా ఎంబీఏలో చేరొచ్చు. విధులు మెకానికల్ ఇంజనీర్లు వారు పనిచేసే ఇండస్ట్రీ, స్పెషలైజేషన్ ఆధారంగా వేర్వేరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్, ప్రొడక్షన్, అనాలసిస్ అండ్ టెస్టింగ్, ఇన్స్టాలేషన్, మెయింటెన్స్ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. టాప్ రిక్రూటర్స్ టాటా గ్రూప్, గోద్రెజ్ గ్రూప్, ఎల్ అండ్ టీ, సీమెన్స్, జీఈ, హ్యుందాయ్ మోటార్స్, ఫోర్డ్, ఆశోక్ లేల్యాండ్, రాయల్ ఎన్ఫీల్డ్, మహింద్రా అండ్ మహింద్రా, జిందాల్ మొదలైనవి. మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఏరియా.. కంప్యూటేషనల్ ఫ్లుయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ) ద్వారా డిజైన్ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. ఈ విభాగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. హానీవెల్, జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) లాంటి పెద్ద కంపెనీలు సీఎఫ్డీపై అవగాహన ఉన్నవారిని నియమించుకుంటున్నాయి. - వి. ఉమామహేశ్వర్, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ