Published
Mon, Sep 26 2016 9:20 PM
| Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం
తిరుమలగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరిలో ఎస్సారెస్పీ కాల్వలపై, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను తుంగతుర్తి , సూర్యాపేట నియోజక వర్గాలలోని చెరువులను, కుంటలను నింపాలని అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ రెండవ దశ కాలువలు 69 ,71 డీబీయంలపై ప్రతి రోజు పర్యవేక్షించాలని సూచించారు. నీటిని వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. త్వరలోనే ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతు పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. వర్షాలు అధికంగా కురుస్తున్న దృష్ట్యా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌సీ వెంకటేశ్వర్‌రావు, ఈఈ ప్రభు కాల్యాన్, సుధీర్, డీఈ శోభారాణి, ఏఈ మల్లేష్, పాల్గొన్నారు.