కమనీయం...గోదాదేవి కల్యాణం | godadevi kalyanam | Sakshi
Sakshi News home page

కమనీయం...గోదాదేవి కల్యాణం

Published Fri, Jan 13 2017 10:55 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కమనీయం...గోదాదేవి కల్యాణం - Sakshi

కమనీయం...గోదాదేవి కల్యాణం

అనంతపురం కల్చరల్‌ : సంక్రాంతి పర్యదిన వేడుకల్లో భాగంగా శుక్రవారం గోదాదేవి కల్యాణాలు  కమనీయంగా జరిగాయి. తపోవనంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ రంగనాథస్వామి ఆలయంలో శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు వడిగేపల్లి నరసింహాచార్యుల నేతృత్వంలో జరిగిన కల్యాణోత్సవంలో  బ్రాహ్మణ సంఘం  రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్‌ విశిష్ట అతిథిగా పాల్గొని కల్యాణం జరిపించారు. 

అంతకు ముందు ఆలయంలో కొలువైన శ్రీనివాసుడికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, అలంకార సేవలు, అర్చనలు జరిగాయి. కార్యక్రమంలో వైష్ణవ సంఘ సభ్యులు విజయ్‌కుమార్, అయ్యంగార్, అరుణ్‌కుమార్‌  తదితరులు పాల్గొన్నారు. అలాగే రామనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం ప్రధాన అర్చకులు సుధాకర శర్మ నేతృత్వంలో  గోదా, రంగనాథుల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement