అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో నిర్వహిస్తున్న అనంత ప్రీమియర్ అండర్–16 క్రికెట్ పోటీల్లో గుత్తి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం గుత్తి రైల్వే క్రీడా మైదానంలో గుత్తి, కొనకొండ్ల జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొనకొండ్ల జట్టు 92 పరుగులకే కుప్పకూలింది. గుత్తి బౌలర్ ఇమ్రాన్ 5 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుత్తి జట్టు 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి విజయం సాధించింది. వచ్చే ఆదివారం చివరి రౌండ్ లీగ్ పోటీలు జరుగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు.
అనంత ప్రీమియర్ లీగ్‌లో గుత్తి విజయం
Published Sun, Jan 22 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
Advertisement
Advertisement