
పేదల సంక్షేమానికి ప్రభుత్వ కృషి
ఓదెల: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఓదెల మండలం మడక గ్రామంలో రూ. 2.50లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తమ నియోజకవర్గంగా పెద్దపల్లిని ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒంటరి మహిళలకు రూ. వెయ్యి పింఛన్ అమలు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పేద ప్రజల కోసం ఇళ్లు కట్టించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
హరితహారం కార్యక్రమంలో ఉపాధి పథకం కింద నాటిన మొక్కలను ఎండిపోకుండా కాపాడాలని సూచించారు. ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గంలోని సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 5 కోట్లతో ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ గట్టు రమాదేవి, సర్పంచ్ ఆవుల గట్టమ్మ, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
కాల్వశ్రీరాంపూర్: క్రీడలతో మానసికోల్లాసం–మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత పొందవచ్చని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి అన్నారు.మల్యాలలో నాలుగు మండలాల స్థాయి కబడ్డీ పోటీలను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఆటల్లో గెలుపోటములు సహజమని జీవితంలో సక్సెస్ కావాలని సూచించారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, విద్యుత్, రవాణా, ముఖ్యంగా సాగునీరు. తాగునీరు తదితర మౌళిక వసతుల కల్పనకు ప్రాముఖ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజక వర్గంలోని ప్రతి పాఠశాలకు ప్రహారీ గోడల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన ట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ సారయ్య గౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, వైస్‌ఎంపీపీ కొనకటి మల్లారెడ్డి, సర్పంచ్ జక్కె రవీందర్ గౌడ్, ఎంపీటీసీ పడాల స్వప్న క్రీడాకారులు పాల్గొన్నారు.