హరిత ఉద్యమం | green parade | Sakshi
Sakshi News home page

హరిత ఉద్యమం

Published Tue, Jul 19 2016 6:59 PM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

హరిత ఉద్యమం - Sakshi

హరిత ఉద్యమం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం జిల్లా లో ఉద్యమంలా సాగుతోంది. ఈ నెల 8న వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడ డిగ్రీ కళాశాల మైదానంలో అ«ధికారికంగా ప్రారంభించారు. సుమారు 14 రోజుల పాటు నిర్వహించే హరితహారంలో 3.35 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా.. అధికారులతో సమీక్షలు జరిపిన మీదట కలెక్టర్‌ డాక్టర్‌ యోగి తారాణా ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో హరితహారం విజయవంతం కోసం ప్రజాప్రతి ని««దlులు, అధికారులు సర్వశక్తులొడ్డుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 22.01 లక్షలు మొక్కలు నాటారు. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 1 కోటి 51 లక్షల 13 వేల 819 మొక్కలు నాటినట్లు కలెక్టర్‌ కార్యాలయవర్గాలు తెలి పాయి. నిజామాబాద్‌ నగరంలో నగరపాలక సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన హరితహారం భారీ ర్యాలీలో మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా, మేయర్‌ ఆకుల సుజాత, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త, జేసీ రవీందర్‌ రెడ్డి, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంత రం నిజామాబాద్‌ నగరంలో వివిధ డివిజన్లలో మొక్కలు నాటారు. అబ్కారీశాఖ మంత్రి టి పద్మారావు కామారెడ్డి మండలం రాఘవాపూర్‌లో కల్లుగీత సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ వి గం గాధర్‌ గౌడ్, ఎక్సైజ్‌ డీసీ డేవిడ్‌ రవికాంత్, డీఆర్‌డీఏ పీఈ చంద్రమోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్యే హన్మంత్‌ సిం« దే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. నిజామాబాద్‌ రూర ల్‌ నియోజకవర్గం సిర్నాపల్లిలో అంతకు ముం దు రోజు రాత్రి బస చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిం చేందుకు ఆయన జక్రాన్‌పల్లి మండలం పడకల్‌లో రాత్రి బస చేసి గ్రామస్తులు, అ«ధికారులు, ప్రజాప్రతినిధులతో హరితహారం ప్రాధాన్యం వివరించారు. ఎల్లారెడ్డి, బాల్కొండ, బోధన్, ఆర్మూరు, బాన్సువాడలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమంలా హరితహారం సాగింది.
పుట్టుక నుంచి చచ్చేవరకు ..
మనిషి పుట్టుక మొదలు చనిపోయేంత వరకు కట్టె అవసరమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి  అన్నారు. అందుకు చెట్టే ప్రధానమని ఆలోచించని మనిషి, పూర్వికులు నాటిన చెట్లను విచక్షణ రహితంగా నరికివేస్తుండటం వలన వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదన్నారు. నిజామాబాద్‌ పట్టణంలోని నెహ్రుచౌక్‌ వద్ద హరితహారం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఐటీఐలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడారు. అడవులు అధికంగా ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నయనే విషయాన్ని ప్రజలు గ్రహించి మన జిల్లాలోనూ ఎక్కువ మొత్తం మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్నారు. చెట్టుతోనే మనకు మనుగడ అని చెట్టు లేని యేడల భవిష్యత్తులో ప్రాణవాయువును ప్రతినిత్యం 3 సిలిండర్‌ల ప్రకారం కొనాల్సి వస్తుందన్నారు. నిజామాబాద్‌లాంటి çనగరంలో వారం రోజులకు ఒక మారు స్నానం చేయాల్సి న దుస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న వ్యవసాయ దినోత్సవం సందర్భంగా 2.50 లక్షల మొక్కలు నాటాలనుకున్నా.. హైదరాబాద్‌ మినహా 9 జిల్లాలో మొక్కల కొరత వల్ల ఈనెల 22వ తేదీన జరుపుకుంటున్నామని వివరించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మాట్లాడుతూ తన చిన్నతనంలో అడవులలో పండ్లను తినేవారిమని, చెట్ల ఆకులలో భోజనం చేసేవారిమని అన్నారు. వారం రోజులు ముసురుకురిసేదనీ, ఈ రోజు ఆ ఆనవాల్లె లేకుండా పోయాయని దానికి కారణం చెట్లను నరకడమే నన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రికైన హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాన మంత్రిని కొనియాడారని ఇలాంటి బహత్తర కార్యక్రమం 29 రాష్ట్రాలలో తెలంగా ణ రాష్ట్రంలో చేపట్టడం అభినందనీమని అన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగి తారాణా మాట్లాడుతూ విచక్షణా రహితంగా అడవులలోని చెట్లను నరికివేయడంతో వర్షాలు పడకపోవడం వల్ల తాగునీరు కొంటున్నామని, ఈ మాదిరిగా రాబోయే 5 సంవత్సరాలు మొక్కలు నాటకున్నచో ఇతర అవసరాలకు వేల రూపాయలతో నీరు కొనాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. నగర మేయర్‌ ఆకుల సుజాత మాట్లాడుతూ నిజామాబాద్‌ పట్టణంలో టారె ్గట్‌ ప్రకారం 5 లక్షల 61 వెయ్యి మొక్కలను నేటి పచ్చదనంతో పలకరించేలా చేసుకుందామని  ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సం యుక్త కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నాగేశ్వర్, అన్ని డివిజన్‌ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement