కర్నూలు బాధ్యతలు హఫీజ్‌ఖాన్‌కు..
Published Mon, Jul 25 2016 12:22 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– సమన్వయ కర్తగా నియమించిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా హఫీజ్‌ఖాన్‌ను నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ను నియమించినట్లు కేంద్ర కమిటీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్‌లోని డిట్రాయిట్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఎంఎస్ చేసిన హఫీజ్‌ఖాన్ 11 ఏళ్ల పాటు అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీని ఏర్పాటు చేసి ప్రజల పక్షాన పోరాటం జరుపుతున్న తీరుపట్ల ఆకర్షితుడై ఉద్యోగాన్ని వదిలి అమెరికా నుంచి వచ్చేశారు. 2010లో జగన్ కర్నూలు జిల్లాలో చేపట్టిన ఓదార్పు యాత్ర సందర్భంగా హఫీజ్‌ఖాన్ పార్టీలో చే రి అన్ని కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేంద్రపాలక మండలి సభ్యులుగా ఉన్న ఈయనకు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. అలాగే «ప్రముఖ బిల్డర్, పారిశ్రామిక వేత్త రాజగోపాల్‌రెడ్డికి వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించారు.
పార్టీ నమ్మకాన్ని నిలబెడతా : హఫీజ్‌ఖాన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో నమ్మకం ఉంచి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు కతజ్ఞతలు. పార్టీ అభివద్ధితోపాటు ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తల సమన్వయం, ప్రజల ఆశీస్సులతో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేస్తాం.
Advertisement
Advertisement