హల్దియా ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు | haldia weekly express got fire in coach | Sakshi
Sakshi News home page

హల్దియా ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు

Published Thu, Jan 21 2016 10:44 PM | Last Updated on Wed, Sep 5 2018 9:51 PM

haldia weekly express got fire in coach

మనుబోలు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలో గురువారం సాయంత్రం హల్దియా ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. చెన్నై నుంచి హల్దియా వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్ మనుబోలు చెరువు సమీపంలో ఎస్-త్రీ బోగీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలును ఆపేశారు.

ప్రయాణికులే పక్కనే వున్న ఇసుక, నీటి సహాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే విషయం తెలుసుకోకుండా చైన్ ఎందుకు లాగారంటూ డ్రైవర్ తమను అసభ్య పదజాలంతో దూషించాడని ప్రయాణికులు వాపోయారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. బ్రేక్ డ్రమ్స్ పట్టుకుపోవడంతో మంటలు చెలరేగి పొగలు వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలో రైలు అరగంట పాటు నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement