Weekly Express
-
విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్ డిమాండ్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): బెంగళూరు రైలు ప్రయాణం విశాఖ వాసులకు గగనంగా మారింది. ఫుల్ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి అయినా.. బెంగళూరుకు విశాఖ నుంచి నేరుగా ఒక్క రైలు కూడా లేదు. అన్నీ ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా వెళ్లేవే. వాటిలో విశాఖ కోటా చాలా తక్కువ. గతంలో విశాఖపట్నం నుంచి నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్‌కు మళ్లించేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, బెంగళూరుకు ప్రత్యేక రైలు కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునేవారే లేకపోయారు. రిజర్వేషన్ కష్టమే.. విశాఖపట్నం మీదుగా బెంగళూరుకు ఎన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా అన్ని ఫుల్‌గానే నడుస్తాయి. ప్రస్తుతం విశాఖపట్నం మీదుగా ప్రశాంతి, హౌరా –యశ్వంత్‌పూర్ వంటి రెగ్యులర్ రైళ్లతో పాటు, ముజఫర్‌పూర్–యశ్వంత్‌పూర్(మంగళ), గౌహతి–శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినస్ బెంగళూరు(ఎస్ఎంవీటీ) (సోమ, మంగళ, బుధ), హౌరా–ఎస్ఎంవీటీ (హమ్‌సఫర్)(మంగళ), హతియా–ఎస్ఎంవీటీ (సోమ, బుధ) భువనేశ్వర్–కృష్ణరాజపురం(హమ్‌సఫర్)(బుధ), డిబ్రూఘడ్–ఎస్ఎంవీటీ స్పెషల్ (గురు), భాగల్పూర్–ఎస్ఎంవీటీ (బుధ), టాటా–యశ్వంత్‌పూర్(శుక్ర), పూరీ–యశ్వంత్‌పూర్ (గరీబ్‌రధ్)(శుక్ర), హౌరా–మైసూరు(శని), టాటా–యశ్వంత్‌పూర్(శని). ప్రతీ ఆదివారాలలో హతియా–ఎస్ఎంవీటీ(ఆది), భువనేశ్వర్–బెంగళూరు కంటోన్మెంట్(ఆది), న్యూ టిన్సుకియా–బెంగళూరు(సోమ), అగర్తలా–ఎస్ఎంవీటీ(హమ్‌సఫర్) (సోమ) వంటీ వీక్లీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కానీ ఈ రైళ్లలో ఎప్పుడూ రిజర్వేషన్ దొరకదు. ఈ ఎక్స్‌ప్రెస్‌లలో రిజర్వేషన్ కావాలంటే కనీసం రెండు, మూడు నెలలు ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నగరవాసులు ఎక్కువశాతం బెంగళూరు వంటి ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరు తరచూ నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ రైళ్లలో వీరికి రిజర్వేషన్ దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీక్లీ ఎక్స్‌ప్రెస్.. మరో రెండు ఆదివారాలే.. ప్రస్తుత డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి ప్రత్యేక కృషితో విశాఖపట్నం నుంచి బెంగళూరుకు డైరెక్ట్‌గా వీక్లీ స్పెషల్ రైలును తాత్కాలికంగా రెండు నెలలు నడిపేందుకు అనుమతి వచ్చింది. ఈ విషయం జూలై 22న ప్రకటించగా వెంటనే ఈ రైల్లోని సీట్లు అన్ని దాదాపుగా ఫుల్ అయిపోయాయి. ఆగస్ట్ 7వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ రైలు 6 ట్రిప్పులు నడవగా ప్రతీ సారి సీట్లు, బెర్తులు ఫుల్ అయ్యి, పూర్తి ఆక్యుపెన్సీతో ఈ రైలు నడిచింది. ఇంకా మిగిలి ఉన్న రెండు ట్రిప్పులలో అంటే సెప్టెంబరు 18, 25తేదీల్లోనూ స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ 64, 08 ఉంది, ఇక ఏసీలో 25, 2 ఉంది. కోచ్‌లు పెంచినా తరగని జాబితా.. ఈ రైలు ఆక్యుపెన్సీ దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ 22వ తేదీ నుంచి ఒక స్లీపర్‌క్లాస్, ఒక థర్డ్ ఏసీ కోచ్‌లను అదనంగా జత చేశారు. అయినా వెయిటింగ్ లిస్ట్ జాబితా తరగడం లేదు. గత ఆదివారం (సెప్టెంబరు 11వ తేదీన) రిజర్వేషన్లు దొరక్క స్లీపర్‌లో దాదాపు 43 మంది, ఏసీలో 15 మంది టికెట్లు రద్దు చేసుకున్నట్లు సమాచారం. అదనంగా పెంచిన కోచ్‌లతో ఈ రైల్లో మొత్తం స్లీపర్ క్లాస్ 720, థర్డ్ ఏసీ–370, సెకండ్ ఏసీ–46 బెర్తులు, సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా విశాఖపట్నం నుంచే ప్రతీసారి నూరు శాతం ఆక్యుపెన్సీతో బయల్దేరుతుంది. ఇంత డిమాండ్ ఉన్న ఈ మార్గంలో నడిచే ఈ వీక్లీ స్పెషల్‌ను డైలీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై ఇటీవల విలేకరుల సమావేశంలో డీఆర్ఎం మాట్లాడుతూ డిమాండ్ ఉన్న రూట్లలో రైళ్లు నడిపేందుకు, అవసరమైనప్పుడు అదనపు కోచ్‌లను జత చేసేందుకు వాల్తేర్ డివిజన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన కృషి ఫలించి, విశాఖ వాసుల ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం. (క్లిక్: నయా ‘ఆన్లైన్’ మోసం.. ఆర్డర్ ఇవ్వకపోయినా ఇంటికి కొరియర్) -
పాలమూరు టు గోవా
♦ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం ♦ జిల్లా మీదుగా తరలిన రైలు ♦ సీనియర్ సిటిజన్ల స్వాగతం గోవాకు వీక్లి ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్–వాస్కోడిగామ రైలు నాంపల్లి నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రైలు పాలమూరు మీదుగా వెళ్లడంతో ఆ రూట్లలో వెళ్లే ప్రయాణికులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి నుంచి ఉదయం 9:20కి బయలుదేరి మహబూబ్‌నగర్ స్టేషన్‌కు 11:57కు చేరుకుంటుంది. స్టేషన్ మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైల్వే ప్రయాణికులకు శుభవార్త. గోవా వెళ్లడానికి హైదరాబాద్ నుంచే రైలు సౌకర్యం ఉండేది. ప్రయాణికుల సౌకర్యార్థం నాంపల్లి నుంచి గోవాకు దక్షిణమధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసింది. గత నెల 29న ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. గోవాకు వీక్లి ఎక్స్‌ప్రెస్ (17021) హైదరాబాద్–వాస్కోడిగామ రైలు నాంపల్లి నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. నాంపల్లి నుంచి ఉదయం 9:20గంటలకు బయలుదేరిన గోవా రైలు మహబూబ్‌నగర్ స్టేషన్‌కు 11:57గంటలకు చేరుకుంటుంది. రైలుకు సీనియర్ సిటిజన్ల స్వాగతం జిల్లా స్టేషన్‌కు చేరుకున్న గోవా రైలుకు స్థానిక స్టేషన్ మేనేజర్ పుష్పరాజ్‌తోపాటు సీనియర్ సిటిజన్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి పూలు దండవేశారు. అనంతరం ప్రయాణికులకు మిఠాయిలు పంచిపెట్టారు. గోవా రైలును వారంలో రెండుసార్లు తిరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోవా ఎక్స్‌ప్రెస్ రైలు వివరాలు ఈ గోవా రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, డోన్, గుంతకల్లు, బళ్లారి, తొరంగల్లు, హోస్పెట్, మునీరాబాద్, కొప్పల్, గద్, అనిగేరి, హుబ్లి, లోండ్‌క్యాస్టిల్‌రాడ్, కుళ్లెం మీదుగా వాస్కోడిగామ(గోవా)కు మరుసటì రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17022) ఉదయం 9గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 7:40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ప్రయాణికులకు సౌకర్యం జిల్లా మీదుగా గోవాకు రైలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. గోవాకు హైదరాబాద్ నుంచి వెళ్లేవారు. టికెట్ ధరలు కూడా తక్కువగాను ఉన్నాయి. ఈ గోవా రైలు వారంలో రెండుసార్లు తిరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహబూబ్‌నగర్ డబ్లింగ్ రైల్వేలైన్‌ను పూర్తి చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళుతుంది. – మహ్మద్ యాకుబ్, రైల్వే ప్రయాణికుడు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా మీదుగా గోవా రైలు వెళ్తుంది. ఈ సౌకర్యాన్ని ఇక్కడి ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమ«ధ్య రైల్వే ఎన్నో వసతులు కల్పిస్తుంది. – పుష్పరాజ్, స్టేషన్ మేనేజర్ -
హల్దియా ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు
మనుబోలు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలో గురువారం సాయంత్రం హల్దియా ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. చెన్నై నుంచి హల్దియా వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్ మనుబోలు చెరువు సమీపంలో ఎస్-త్రీ బోగీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలును ఆపేశారు. ప్రయాణికులే పక్కనే వున్న ఇసుక, నీటి సహాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే విషయం తెలుసుకోకుండా చైన్ ఎందుకు లాగారంటూ డ్రైవర్ తమను అసభ్య పదజాలంతో దూషించాడని ప్రయాణికులు వాపోయారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. బ్రేక్ డ్రమ్స్ పట్టుకుపోవడంతో మంటలు చెలరేగి పొగలు వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలో రైలు అరగంట పాటు నిలిచిపోయింది. -
చెన్నై ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీ మిస్..
విశాఖపట్నం సిటీ: విశాఖ నుంచి సోమవారం చెన్నైకు బయల్దేరాల్సిన వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22869)లో ఒక థర్డ్ ఏసీ బోగీ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు సరిగా స్పందించకపోవడంతో వారిపై దాడికి దిగారు. దీంతో రైలు రెండు గంటల ఆలస్యంగా రాత్రి 9.15 గంటలకు బయల్దేరింది. -
పట్టాలెక్కిన ‘పారాదీప్’
బడ్జెట్లో ప్రకటించిన వీక్లీ రైలు ఇప్పటికే మూడు రైళ్లు ప్రారంభం విశాఖపట్నం సిటీ : విశాఖపట్నం-పారాదీప్-విశాఖపట్నం(22810/22809) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. రైల్వే మంత్రి సురేష్‌ప్రభాకర్ ప్రభు రిమోట్ కంట్రోల్ సాయంతో ఢిల్లీ నుంచి ప్రారంభించినట్టు ప్రకటించగా బుధవారం మధ్యాహ్నం విశాఖ రైల్వేస్టేషన్ లో ఎంపీ హరిబాబు జెండా ఊపి ప్రారంబించారు. 2014-15 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన నాలుగు రైళ్లలో మూడు రైళ్లు ఇప్పటికే పట్టాలెక్కగా బుధవారం విశాఖ-పారాదీప్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు తీసింది. చిన్న చిన్న ప్రాజెక్టులు మినహా రైళ్లన్నీ పట్టాలెక్కడంతో వచ్చే బడ్జెట్‌పై కొత్త రైళ్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు. గత బడ్జెట్లో ప్రకటించిన నాలుగు రైళ్లలో మూడు రైళ్లను వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభం కావడం పట్ల ఎంపీ హరిబాబు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క రైలునైనా ప్రారంభించేందుకు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజే స్తూనే కాస్త అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ రైలు రెండు పోర్టు సిటీలను కలుపుతుందని ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ కొత్త రైళ్ల ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఎం అనిల్‌కుమార్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఇక ప్రతీ వారం పారాదీప్‌కు..! ఇక ప్రతీ వారం పారాదీప్‌కు వెళ్లే మార్గం విశాఖ వాసులకు దక్కింది. ఎక్కువ మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్‌కు వెళ్లి అక్కడి నుంచి వేటకు వెళుతుంటారు. ఈ రైలు రాకతో మత్స్యకారులు సుమారు 550 కిలోమీటర్లు సముద్ర మార్గంలో కాకుండా రైలు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి చేపల వేటకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ రైలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు పారాదీప్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రతీ బుధవారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 8.30 గంటలకు విశాఖకు చేరుతుంది. విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, సోంపేట, ఇచ్చాపురం, బ్రహ్మపురం, ఛత్రపూర్, కుర్దా రోడ్, భువనేశ్వర్, మంచేశ్వర్, కటక్, రహమ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ రైల్లో మొత్తం 19 బోగీలుంటాయి. వీటిలో ఏడు స్లీపర్ క్లాస్, ఎనిమిది జనరల్ బోగీలుంటాయి. -
కూతెయ్యని రైలు
రైల్వే బడ్జెట్లో..జిల్లాకు మొండిచేయి తిరుపతి ‘మోడల్ స్టేషన్’కూ మోక్షం లేదు జిల్లాలో ట్రాక్ డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రస్తావనేదీ...? ‘డబుల్ డెక్కర్’ రైలైనా వచ్చేనా.! తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రైల్వేమంత్రి మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో మన జిల్లాకు మొండిచేయే మిగిలింది. అయితే గత ఏడాది రైల్వే మంత్రి ప్రకటించిన కాచిగూడ-తిరుపతి మధ్య ఒక డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు కొత్తగా ప్రకటించినట్లు ఆర్భాటం చేశారు. ఇదైనా వస్తుందా అనేది అనుమానమే. అలాగే చెన్నై నుంచి రేణిగుంట మీదుగా ఔరంగాబాద్ వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించగా, ఈ రైలుకు సంబంధించి స్పష్టత లేదని రైల్వే యూనియన్లు అంటున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌కున్న ప్రాధాన్యం, వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ కేటాయింపులు ఉండాలని ప్రతిసారీ రైల్వే అభివృద్ధి కమిటీ, రైల్వే యూనియన్లతో పాటు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నా రైల్వే మంత్రులు పెడచెవిన పెడుతున్నారు. జిల్లాలోని మదనపల్లె మార్గంలో విద్యుద్దీకరణ, చిత్తూరు మార్గంలో ట్రాక్ డబ్లింగ్ కోసం ప్రతిపాదనలు ఉన్నా బడ్జెట్లో వాటి గురించి ప్రస్తావనే చేయలేదు. జిల్లాలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల అవసరం ఉన్నా, బడ్జెట్లో వాటి ఊసే లేదు. గత ఏడాది చెప్పి.. అమలు కానివి మదనపల్లె నుంచి శ్రీనివాసపురం(కర్ణాటక) వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు సర్వేకి కూడా నోచుకోలేదు. మంగళూరు-కాచిగూడ మధ్య కొత్తగా రైలు ఏర్పాటు చేసి రేణిగుంట మీదుగా నడపాలని నిర్ణయించారు. ఇదీ అమలు కావడం లేదు. చెన్నై నుంచి నాగర్సోల్(షిరిడీకి దగ్గర) వరకు రేణిగుంట మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతామన్నారు. ఇదీ ఏర్పాటు చేయలేదు. -
4 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖపట్నం మీ దుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే పచ్చజెండా ఊపింది. గువహటి-సికింద్రాబాద్, హైదరాబాద్-షాలిమా ర్, షాలిమార్-యశ్వంత్‌పూర్, సాం త్రగచ్చి-కొచివేలి వంటి ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లతో పాటు ఇప్పటికే నడుస్తున్న విశాఖ-కొల్లాం(కేరళ) రైలును మరో రెండు మాసాల వరకూ పొడి గిస్తూ ఆదివారం ప్రకటన జారీ చేసింది. కొల్లాం రైలు పొడిగింపుతో అయ్యప్ప భక్తుల ప్రయాణ సమస్యలు దాదాపు తీరినట్టేనని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొల్లాం రైలును సెప్టెంబర్ నెల వరకూ మాత్రమే ప్రకటించిన రైల్వే తాజాగా అక్టోబర్, నవంబర్ మాసాల చివరి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రయాణికులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తం 17 బోగీలుండే ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ చెరోబోగీతో బాటు 7 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలుంటాయి. రైలు నంబర్ 08569 విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28వ తేదీ వరకూ(మొత్తం 16 ట్రిప్పులు) ప్రతి ఆది, గురువారాల్లో ఉదయం 9 గంటలకు విశాఖ నుంచి బయల్దేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, కాట్పడి, జోలార్పేటయ్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం మీదుగా కొల్లాంకు ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడకు మధ్యాహ్నం 2.50 గంటలకు, గూడూరుకు రాత్రి 8.28 గంటలకు, కోయంబత్తూర్‌కు ఆ మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు చేరుతుంది. రైలు నంబర్ 08570 కొల్లాం-విశాఖపట్నం బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ ప్రతి సోమ, శుక్రవారాల్లో రాత్రి 9 గంటలకు కొల్లాంలో బయల్దేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు కోయంబత్తూర్ చేరుకునే ఈ రైలు గూడూరు స్టేషన్‌కు ఉదయం 14.50 గంటలకు, విజయవాడకు రాత్రి 7.10 గంటలకు, చేరుకునే ఈ రైలు అర్థరాత్రి 1.25 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుతుంది. గువహటి-సికింద్రాబాద్ మధ్య 9 ట్రి ప్పులు రైలు నంబర్ 07149 సికింద్రాబాద్-గువహటి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌లో ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖలో రాత్రి 8.20 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు గువహటి చేరుకుంటుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ 9 ట్రిప్పులు నడుస్తుంది. రైలు నంబర్ 07150 గువహటి-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు గువహటిలో బయల్దేరి మంగళవారం రాత్రి 7.40 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి బుధవారం ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ ఈ ప్రత్యేక రైలు విశాఖ మీదుగా పరుగులు తీస్తుంది. దువ్వాడ, విశాఖ, విజయనగరం, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్లలో ఆగే ఈ రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ చెరో బోగీతో బాటు 8 స్లీపర్‌క్లాస్ బోగీలు, 6 జనరల్ బోగీలుంటాయి. హైదరాబాద్ -షాలిమర్ మధ్య సూపర్‌ఫాస్ట్ రైలు నంబర్ 07128 స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకూ ప్రతి ఆదివారం రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.45 గంటలకు బయల్దేరి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07127 షాలిమర్-హైదరాబాద్ స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ ప్రతి మంగళవారం ఉదయం 11.05 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు తెల్లవారు జామున 1.30 గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖ నుంచి ప్రతి బుధవారం తెల్లవారుజామున 1.50 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్, భద్రక్ స్టేషన్లలో ఆగే ఈ రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ చెరో బోగీతో బాటు 10 స్లీపర్‌క్లాస్ బోగీలు, 4 జనరల్ బోగీలుంటాయి. యశ్వంత్‌పూర్‌కు స్పెషల్ యశ్వంత్‌పూర్‌కు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే ఉంటాయి. అందుకే దసరా సీజన్లో మరో ప్రత్యేక రైలును ఈ మార్గంలో నడుపుతున్నారు. షాలిమర్ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య ఈ ప్రత్యేక రైలు 8 ట్రిప్పులు నడుస్తుంది. విశాఖకు రాకుండానే ఈ రైలు దువ్వాడ మీదుగా ప్రయాణిస్తుంది. ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని దువ్వాడ, విజయనగరం, బరంపూర్, కుర్దారోడ్, భువరనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్ల మీదుగా ప్రయాణించే ఈ రైలులో ఫస్టు, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో బాటు 11 స్లీపర్ క్లాస్ బోగీలుంటాయి. జనరల్ బోగీలు ఈ రైల్లో ఉండవు. రైలు నంబర్ 02863 షాలిమర్-యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్7 వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకూ ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి అదే రోజు రాత్రి 11.43 గంటలకు దువ్వాడ స్టేషన్‌కు చేరుతుంది. రెండు నిమిషాల హాల్టు అనంతరం బయల్దేరి మంగళవారం సాయంత్రం 4 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. రైలు నంబర్ 02864 యశ్వంత్ పూర్-షాలిమర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 27వ తేదీ వరకూ ప్రతి బుధవారం ఉదయం 11.15 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి ప్రతి గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి దువ్వాడలో 3.32 గంటలకు బయల్దేరి ప్రతి గురువారం సాయంత్రం 4.20 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. సాంత్రగచ్చి(హౌరా) నుంచి కేరళకు మరో స్పెషల్ కేరళలోని త్రివేండ్రం సమీపంలో ఉన్న కొచువేలి స్టేషన్ నుం చి హౌరా దరి సాంత్రగచ్చి స్టేషన్‌కు మరో ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ రైలు విశాఖ మీదుగా ప్రయాణిస్తుంది. రైలు నంబర్ 02851 సాంత్రగచ్చి-కొచువేలి స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకూ ప్రతి శనివారం సాయంత్రం 4.05 గంటలకు సాంత్రగచ్చిలో బయల్దేరి ఆదివారం తెల్లవారు జామున 4.40గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుకుంటుంది. విశాఖలో తెల్లవారు జామున 5 గంటలకు బయల్దేరి సోమవారం ఉదయం 10.30 గంటలకు కొచువేలి చేరుకుంటుంది. రైలు నంబర్ 02852 కొచువేలి నుంచి హౌరా స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి డిసెంబర్ 3వ తేదీ మధ్య ప్రతి మంగళవారం తెల్లవారుజామున 4.15 గంటలకు కొచువేలిలో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 11.15 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖలో 11.35 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సాంత్రగచ్చి చేరుతుంది. ఈ రైలులో రెండు థర్డ్ ఏసీ, 8 స్లీపర్ క్లాస్ బోగీలు, 6 జనరల్ బోగీలుంటాయి.