సూర్యాపేట: పెద‍్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పెద‍్దఎత్తున తరలివచ్చారు. సోమవారం వేకువజామునుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది. ఎక‍్కడివాహనాలు అక‍్కడ ఆగిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్ళించారు. నార‍్కట్‌పల్లి, నల‍్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడల మీదుగా వాహనాలను మళ్ళించారు.